https://oktelugu.com/

Samantha Social Media Promotions: ఒక్కో పోస్ట్ కే ‘సమంత’ అంత అడుగుతుందా ?

Samantha Social Media Promotions: నాలుగేళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికాక, సమంత సరికొత్త ప్రయాణం మొదలు పెట్టింది. భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేస్తూ కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్న సమంత రెమ్యూనరేషన్ పెంచేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ రేట్లు కూడా రెట్టింపు చేసేసింది. సమంత ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలా బ్రాండ్‌ లను ప్రమోట్ చేస్తోంది. కంపెనీలు కూడా […]

Written By:
  • Shiva
  • , Updated On : March 28, 2022 / 05:00 PM IST
    Follow us on

    Samantha Social Media Promotions: నాలుగేళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికాక, సమంత సరికొత్త ప్రయాణం మొదలు పెట్టింది. భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేస్తూ కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్న సమంత రెమ్యూనరేషన్ పెంచేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ రేట్లు కూడా రెట్టింపు చేసేసింది.

    Samantha

    సమంత ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలా బ్రాండ్‌ లను ప్రమోట్ చేస్తోంది. కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ప్రమోట్‌ చేసుకునేందుకు సమంత దగ్గరకు వస్తున్నాయి. దాంతో సామ్ తన ఇన్‌ స్ట్రాగ్రామ్‌ ను బిజినెస్ వేదికగా మలుచుకుంటూ ఒక్కో పోస్ట్ కి ఇంత అని లెక్క గట్టి బాగా డిమాండ్ చేస్తోంది. ఇంతకీ సమంత పెట్టే ప్రతి పోస్ట్‌ కు ఎంత అడుగుతుందో తెలుసా ? ఏకంగా ఒక్క మెసేజ్ కి రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు డిమాండ్‌ చేస్తోందట.

    ఇంత భారీ మొత్తం తీసుకుంటున్న ఏకైక తెలుగు హీరోయిన్ సమంతనే. ఎంతైనా సామ్ ది నేషనల్ రేంజ్ క్రేజ్ కదా. బాలీవుడ్ హీరోయిన్లు ఒక్కో పోస్ట్ కి 8 నుంచి పది లక్షలు తీసుకుంటున్నారని… అది కూడా అందరికీ ఇవ్వట్లేదు అని తెలుస్తోంది. మరి సామ్ కి ఎందుకు అంత భారీగా ఇస్తున్నారంటే.. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. అన్నిటికి కంటే ముఖ్యంగా ఆమె ఫాలోవర్స్ లో ఎక్కువమంది చాలా యాక్టివ్ గా ఉన్నారు.

    Also Read: Puri Jagannadh Latest Update: బిగ్ అప్ డేట్ కి ఇంకా 14:20 గంటల సమయం ఉంది !

    మొత్తానికి సామ్ సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ పెంచుకొని యాడ్స్ పోస్ట్ లతో కూడా ఫుల్ గా సంపాదిస్తుంది. అన్నట్టు తన భర్త నుంచి విడిపోయాక.. ఒంటరిగా గడపడానికి అందమైన విలాసవంతమైన బంగ్లాను కట్టుకుంది. ప్రస్తుతం తన ఒంటరి జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతుందట. పైగా సామ్ పై ఇప్పటికే అనేక గాసిప్స్ కూడా వినిపించాయి.

    ఏది ఏమైనా సామ్ అంటే ఒకప్పటి తెలుగు టాప్ హీరోయిన్. సౌత్ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి .. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో రెచ్చిపోతూ గ్లామర్ ప్రపంచం పై తన మార్క్ చూపించాలని ఆరాట పడుతుంది. అన్నట్టు సామ్ ఫొటోషూట్స్‌, వీడియోలు చేస్తూ వాటికి కూడా అదనంగా రెండు నుంచి మూడు రెట్లు డిమాండ్‌ చేస్తూ చక్కగా సంపాదించుకుంటుంది.

    Also Read: RGV Tweets On Rajamouli: రాజమౌళి.. నువ్వు ప్రేక్షకులకు దొరికిన బంగారం !

    Recommended Video:

    Tags