https://oktelugu.com/

Chanakya Niti: ఇలాంటి కంచు భార్య మీ లైఫ్ లో ఉందా? వినాశనం తప్పదు

ఎన్నో విషయాల గురించి వివరించిన చాణక్యుడు భార్యభర్తల బంధం గురించి కూడా వివరించారు. ఇందులో భార్య గుణాలను కూడా తెలిపారు. భార్యకు సరైన నడవడిక లేకపోతే ఆ భర్త చనిపోయే అవకాశాలు ఉంటాయని తెలిపారు చాణక్యుడు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 14, 2024 / 12:43 PM IST

    Chanakya Niti

    Follow us on

    Chanakya Niti: భార్యాభర్తలు కలిసి మెలిసి ఉంటే ఆ ఇల్లు ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. వీరిని చూస్తూనే పిల్లలు పెరుగుతారు కాబట్టి పిల్లల కోసం అయినా ఆనందంగా ఉండాలి. మీ ప్రవర్తన, మీ బిహేవియర్ పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. ఇక భార్య భర్తల సంతోషం వల్ల ఎన్నో సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. కొన్ని వందల సమస్యలను కూడా భార్యాభర్తల అన్యోన్యత దూరం చేస్తుంది. ఇక భార్యభర్తల బంధం గురించి కొన్ని విషయాలను వివరించారు చాణక్యుడు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

    ఎన్నో విషయాల గురించి వివరించిన చాణక్యుడు భార్యభర్తల బంధం గురించి కూడా వివరించారు. ఇందులో భార్య గుణాలను కూడా తెలిపారు. భార్యకు సరైన నడవడిక లేకపోతే ఆ భర్త చనిపోయే అవకాశాలు ఉంటాయని తెలిపారు చాణక్యుడు. మరి భర్త మరణానికి కారణం అయ్యే ఆ స్త్రీ ఎలా ఉంటుందో కూడా ఓ సారి చూసేయండి. దురుసుగా మాట్లాడే స్త్రీలు ఎప్పుడు భర్తకు ఇబ్బందిగానే ఉంటారట. తుంటరి స్త్రీలు, చంచలమైన, దుష్ట స్వభావాలు గల స్నేహితులు ఉన్నా భర్తకు మరణం సంభవించడం ఖాయం అంటారు చాణక్యుడు.

    చెడు స్వభావం ఉన్న స్నేహితులను కూడా అసలు నమ్మకూడదట. ఇలాంటి స్వభావం ఉంటే మోసం, ద్రోహం చేయడానికే ఎక్కువగా ఆలోచిస్తారట ఇలాంటి స్నేహితులు. ఇక మీకోసం పనిచేసే సేవకుడు,ఉద్యోగి కూడా మీకు వ్యతిరేక సమాధానాలు ఇస్తుంటే వారు మీకు హాని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తు పెట్టుకోండి. ఒక దుష్ట స్త్రీ నివసించే ఇంట్లో ఆ ఇంటి యజమాని స్థానం చనిపోయిన వ్యక్తికి సమానమే అంటారు చాణక్యుడు.

    దుష్ట స్త్రీ పాముతో సమానమని, పాము ఉన్న ఇంట్లో నివసించడం మరణంతో సమానమే అంటారు చాణక్యుడు. అందుకే ఇలాంటి స్త్రీ ఉంటే ఆమెకు అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పి ఆమె మనసును, ప్రవర్తనను మార్చే విధంగా చూడాలి. లేదంటే వీరితో మీ జీవితం చాలా నరకంగా అనిపిస్తుంటుంది. మరి తెలుసుకున్నారుగా జాగ్రత్త సుమ.