Chanakya Niti Woman: ఆచార్య చాణక్యుడు మనిషి జీవితంలో ఎదురయ్యే పలు కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలో చెబుతాడు. ఒక వ్యక్తి ఇతరులతో ఎలా ప్రవర్తించకూడదో సూచిస్తాడు. భవిష్యత్ ను మార్చుకునే మార్గాల్లో విజయం సాధించడానికి ఎలా ముందుకు వెళ్లాలో వివరించాడు. సంపద, భార్య, స్నేహం విషయాల్లో కీలక సమాచారం అందించాడు. స్త్రీని ఎప్పుడు కూడా నమ్మొద్దని చెబుతాడు.
చెడు స్వభావం
అవినీతి, చెడు స్వభావం ఉన్న స్త్రీని ఎప్పుడు నమ్మకూడదు. అలాంటి మహిళ పురుషులకు ఆకర్షితురాలు అవుతుంది. అలాంటి పరిస్థితిలో భర్త ఆమెకు శత్రువుగా మారడం ఖాయం. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపుతాయి. ఉద్దేశాలు మారతాయి. అందుకే అలాంటి స్త్రీని అసలు వివాహం చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే జీవితం నరకమే.
అందం
స్త్రీ అందాన్ని చూసి మోసపోకు. బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యమే గొప్పది. స్త్రీలో దురాశ ఉంటే నాశనమే. శాంతికి భంగం కలుగుతుంది. మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. స్త్రీలకు అహంకారం ఉండకూడదు. అలాంటి వారిపై దేవతలు కూడా అనుగ్రహం చూపరు. దీంతో కుటుంబం ఇక్కట్ల పాలవుతుంది. వీరి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి.
మంచి గుణాలు
ఇలా చాణక్యుడు స్త్రీలోని ఉండకూడని గుణాల గురించి చెబుతున్నాడు. మహిళలను అన్ని వేళలా నమ్మొద్దు. వారి గుణం మంచిది కాకపోతే అంతే సంగతి. మన కుటుంబం నాశనం కావడం సహజం. అందుకే అలాంటి గుణాలు ఉన్న వారికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. లేకపోతే నిన్ను నీ కుటుంబాన్ని దహిస్తుంది. చాణక్యుడు మనిషి జీవితంలో ఎదుర్కొనే ఎన్నో విషయాలు చెప్పాడు. వాటిని పాటిస్తే మనకు కష్టాలు రానే రావు.