Anchor Sreemukhi: రియాలిటీ షో నీతోనే డాన్స్ కి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇది సెలబ్రిటీ డాన్స్ కాంటెస్ట్. ఇటీవల స్టార్ మా లో ప్రారంభమైంది. నీతోనే డాన్స్ షోకి శ్రీముఖి ప్రత్యేక ఆకర్షణ అవుతున్నారు. ఆమె గ్లామర్, ఎనర్జీ జోష్ నింపుతుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి షార్ట్ ఫ్రాక్ ధరించి. ఆమె లుక్ హాట్ గా ఉంది. ట్రెండీ డ్రెస్ లో ఫోటో షూట్ చేసిన శ్రీముఖి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. శ్రీముఖి ఫోటోలపై నెటిజెన్స్ తమదైన కామెంట్స్ చేస్తుంది.
శ్రీముఖి బుల్లితెర యాంకర్ గా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. శ్రీముఖి నటి కావాలనే ఆశతో పరిశ్రమలో అడుగు పెట్టారు. అవకాశాల కోసం ప్రయత్నాలు చేసే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయట. క్యాస్టింగ్ కౌచ్ కూడా ఎదుర్కుంటున్నారట. దాంతో ఆమె దృష్టి బుల్లితెర మీదకు మరిలింది. పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చింది. యాంకర్ రవితో పాటు శ్రీముఖి పటాస్ షో యాంకర్ గా చేశారు. యాంకర్ గా ఎదుగుతున్న క్రమంలో బిగ్ బాస్ సీజన్ 3లో ఛాన్స్ వచ్చింది.
బిగ్ బాస్ హౌస్లో సత్తా చాటిన శ్రీముఖి ఫైనల్ కి వెళ్ళింది. తృటిలో టైటిల్ చేజారింది. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ కాగా శ్రీముఖి రన్నర్ పొజిషన్ తో సరిపెట్టుకుంది. అయితే షో ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఐదారు షోలు శ్రీముఖి ఖాతాలో ఉన్నాయి. మేకర్స్ ఫస్ట్ ఛాయిస్ గా శ్రీముఖి మారారు. శ్రీముఖి భారీగా సంపాదిస్తునట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్ లో నిర్మించుకున్న కొత్త ఇంట్లో అడుగుపెట్టింది.
మరోవైపు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చట్టాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో శ్రీముఖి నటించింది. హీరోయిన్ కావాలనేది ఆమె లక్ష్యం. క్రేజీ అంకుల్స్ టైటిల్ తో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామాలో శ్రీముఖి హీరోయిన్ గా చేయడం విశేషం. శ్రీముఖి ఫేమ్ భారీగా పెరిగిన నేపథ్యంలో ఆమెకు వెండితెర ఆఫర్స్ విరివిగా వస్తున్నాయట. అయితే శ్రీముఖి ఆచితూచి ఎంచుకుంటున్నారట. నెక్స్ట్ ఆమె భోళా శంకర్ లో ఓ పాత్ర చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తంగా శ్రీముఖి కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది.