https://oktelugu.com/

Kurnool : ముద్దు పెడితే నాలుక కొరికేసిన భార్య.. అసలు కారణం ఇదేనట!

శుక్రవారం ఉదయం కూడా వీరి మధ్య చిన్నపాటి వివాదం నెలకొంది. దీంతో తారాచంద్ భార్యపై దాడిచేశాడు. అక్కడికి కొద్దిసేపటికి భార్య వద్దకు వెళ్లి ముద్దుపెట్టాడు. అప్పటికే భర్తపై తీవ్ర కోపంతో ఉన్న పుష్పావతి నాలుక కొరకడంతో తెగిపడింది.

Written By:
  • Dharma
  • , Updated On : July 22, 2023 / 09:34 AM IST
    Follow us on

    Kurnool : ముద్దు అనేది ఒక ఎమోషన్. ఎదుటి వారిపై తమకు ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి, స్వీకరించడానికి ఒక సాధనం. భార్యాభర్తలు, స్నేహితులు, ప్రేమికులు తమ మధ్య ప్రేమను, అప్యాయతను తెలియజేయడానికి ఉపయోగపడే ఒక భావోద్వేగం ‘ముద్దు’. అందుకే ముద్దు లేనిదే జీవితం వ్యర్థమని ముద్దుని వర్ణిస్తూ రాసిన ఎన్నో పాటలు తరూచూ సినిమాల్లో వింటూనే వింటాం. అంతటి ప్రాధాన్యమున్య ముద్దుకు సంబంధించిన ఏ విషయమైనా ఆసక్తికరంగానే ఉంటుంది. ముద్దు పెట్టే ప్రయత్నం ఒక్కోసారి వికటిస్తుంది కూడా. అటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇష్టం లేకుండా ముద్దుపెట్టిన వ్యక్తి నాలుక పొగొట్టుకున్నాడు. అతిగా ముద్దుకు ఆశించి మాట కోల్పోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. వినడానికి ఆసక్తిగా ఉంది కదూ. నిజంగా జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

    కర్నూలుకు చెందిన తారాచంద్ నాయక్.. అదే జిల్లాలోని తుగ్గలి మండలం ఎల్లంగుట్ట తండాకు చెందిన పుష్పావతిని 2015లో ప్రేమ  వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా గడిచిన వీరి దాంపత్యంలో గత రెండేళ్లుగా వివాదాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల మరింత తీవ్రమయ్యాయి. శుక్రవారం ఉదయం కూడా వీరి మధ్య చిన్నపాటి వివాదం నెలకొంది. దీంతో తారాచంద్ భార్యపై దాడిచేశాడు. అక్కడికి కొద్దిసేపటికి భార్య వద్దకు వెళ్లి ముద్దుపెట్టాడు. అప్పటికే భర్తపై తీవ్ర కోపంతో ఉన్న పుష్పావతి నాలుక కొరకడంతో తెగిపడింది. తీవ్ర రక్తస్రావంతో తారాచంద్ ఆస్పత్రికి పరుగుపెట్టాడు. గుత్తి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం అనంతపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.

    ఇష్టం లేకుండా ముద్దు పెట్టినందునే తాను నాలుక కొరికినట్టు భార్య చెబుతోంది. బలవంతంగా ప్రయత్నిస్తే వద్దని చెప్పానని.. అయినా వినకుండా ముద్దుపెట్టడం వల్లే ఆ పనిచేసినట్టు చెప్పుకొస్తోంది. అయితే తన భార్యకు వేరొకరితో అఫైర్ ఉందని.. అందుకే తనను దూరం పెడుతోందని తారాచంద్ చెబుతున్నాడు. నాకు నా పిల్లలకు ప్రాణ రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతున్నాడు. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముద్దు అనేది పరస్పర ఇష్టం, అంగీకారంతో పెట్టుకోవాలి కానీ.. బలవంతం చేస్తే రిజల్ట్ ఇట్టే ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.