Chanakya Niti: భార్యభర్తల బంధం చాలా గొప్పది. కానీ ఈ బంధాన్ని కాపాడుకోవడం చాలా కష్టతరమైన పనిలా మారింది. చిన్న గొడవలకు విడాకుల వరకు వచ్చే ఈ రోజుల్లో.. ఇద్దరి మధ్య కలకాలం మంచి లైఫ్ ఉండాలంటే ఇద్దరు జాగ్రత్త పడాల్సిందే. అయితే కొన్ని విషయాలు భర్త భార్యతో చెప్పకుండా ఉండాలి అన్నారు చాణక్యుడు. ఈయన సలహాలు, సూచనలు పాటించినవారు జీవితంలో సక్సెస్ ను సాధిస్తుంటారు. అదే విధంగా భర్త భార్య వద్ద ఎలాంటి విషయాల గురించి మాట్లాడకూడదో కూడా తెలుసుకోండి.
#1. బలహీనత:
భర్త బలహీనత భార్యకు చెప్పకూడదట. మీ వీక్ నెస్ ఆమెకు తెలిస్తే దాని గురించి పదే పదే మాట్లాడే అవకాశం ఉంది. బలహీనత నుంచి బయట పడాలని ప్రయత్నించినా కూడా అడ్డు పడుతుందట భార్య. కాబట్టి భర్తలు ఈ విషయాన్ని భార్యల వద్ద గోప్యంగా ఉంచాలి.
#2. ఆదాయం:
మీకు వచ్చే మొత్తం ఆదాయం గురించి కూడా భార్యకు చెప్పకూడదు అంటారు చాణక్యుడు. ఇలా తెలిస్తే ఖర్చులు కూడా పెరుగుతాయి అని హెచ్చరించారు.
#3. అవమానం
మీకు జరిగిన అవమానం గురించి కూడా ఆమెతో షేర్ చేసుకోకపోవడం బెటర్. లేదంటే చులకనగా చూడటం, పదేపదే దాని గురించి మాట్లాడటం చేస్తుంది. అందుకే మీకు జరిగిన అవమానం గురించి కూడా భార్య కి చెప్పకూడదు.
#4. సహాయం:
ఎవరికి అయినా ఏదైనా సహాయం చేయాలన్నా కూడా కొన్ని సార్లు మీ భార్య అడ్డు పడే అవకాశం ఉంటుంది. తోటి వారికి అవసరం అయ్యే సహాయం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అందుకే మీరు చేయాలనుకునే సహాయం గురించి కూడా భార్యతో చెప్పడం మంచిది కాదు అన్నారు చాణక్యుడు.