Chhatrapati Shivaji: ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో ఉన్న శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక దేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ తల్లి మందిరం చాలా ప్రసిద్ధి చెందింది. అష్టాదశ పీఠాలలో ఈ శ్రీశైల మల్లికార్జున గుడి ఒకటిగా చెప్తారు. ఏకంగా శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబికా దేవికి ఛత్రపతి శివాజీకి మాత్రం ఓ ప్రత్యేక సంబంధం ఉంది అంటున్నారు పండితులు. ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు. 1677వ సంవత్సరంలో అప్పటి గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ కుతుబ్ షాకు,చత్రపతి శివాజీకి మధ్య చాలా మంచి అనుబంధం ఉండేదట.
అయితే ఓ సారి శివాజీ శ్రీశైలానికి వచ్చారట. అప్పటికి సుల్తాన్ ఆస్థానం లో ఉన్న మంత్రులు శివాజీకి ఆహ్వానం పలికారు. చత్రపతి శివాజీ తిరుగు పయనమయ్యే వరకు కూడా ఆయన వెంటే ఉండి అన్ని విషయాల్లో సహాయం చేశారట. ఇలా శివాజీ శ్రీశైల భ్రమరాంబిక ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ శివాజీ ఆత్మార్పణ చేసుకోవడానికి ప్రయత్నించారట. ఆ సమయంలో భ్రమరాంబికా దేవి ప్రత్యక్షమై తనకు ఒక ఖడ్గాన్ని ఇచ్చారట.
ఆ ఖడ్గం వల్ల విజయాలే సొంతం అవుతాయని తెలిపారట అమ్మవారు. చత్రపతి శివాజీ ఆ ఖడ్గాన్ని తీసుకున్న దగ్గర నుంచి ప్రతి యుద్ధంలోనూ విజయాన్ని అందుకున్నారు. ఆ విజయాలన్నింటికి కారణం అమ్మవారు ఇచ్చిన ఖడ్గమే అని శివాజీ నమ్మారట. ఆ ప్రాంతంలో ఆలయం కట్టి శివాజీ సొంతంగా చూసుకునేవారు. పక్కనే ఉన్న కృష్ణా నది ఒడ్డున స్నానపు ఘాట్లని కూడా ఏర్పాటు చేశారు ఛత్రపతి శివాజి.
అమ్మవారికి రక్షణ కల్పించేలా తన రక్షక భటులను అక్కడ కాపలా ఉంచేవారట. ఇప్పటికీ శ్రీశైల బ్రమరాంబిక అమ్మవారి గోపురం మీద శివాజీ అమ్మవారి చేతుల మీదగా కత్తి తీసుకుంటున్నట్టు కొన్ని బొమ్మలు చెక్కి ఉంటాయి. అంతేకాదు అక్కడ ఉన్న మ్యూజియంలో శివాజీ గురించి చాలా విశేషాలు తెలుసుకోవచ్చట.