Homeలైఫ్ స్టైల్Chanakya Niti Relationship: చాణక్య నీతి: ఐదు కారణాల వల్ల మగవారు వివాహేతర సంబంధాలను పెట్టుకుంటారట

Chanakya Niti Relationship: చాణక్య నీతి: ఐదు కారణాల వల్ల మగవారు వివాహేతర సంబంధాలను పెట్టుకుంటారట

Chanakya Niti Relationship: పెళ్లయినా ఇతర స్త్రీల మీద వ్యామోహం పెంచుకునే వారు చాలా మంది ఉన్నారు. దీంతో దాంపత్య జీవితంలో మరో కోణంలోకి వెళుతోంది. వైవాహిక జీవితం నరకప్రాయం అవుతోంది. కొన్ని సందర్బాల్లో జీవిత భాగస్వామిని తుద ముట్టించేందుకు కూడా వెనకాడటం లేదు. ఈ నేపథ్యంలో కుటుంబ జీవితం దుర్భరంగా మారుతోంది. ఎన్నో సంసారాలు సమస్యల్లో చిక్కుకుంటున్నాయి. ఆచార్య చాణక్యుడు వివాహేతర సంబంధాలు ఏర్పడటానికి ఐదు కారణాలు చూపాడు.

స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ సాధారణమే. కానీ ఆకర్షణ తప్పుగా మారితే కష్టం. అక్రమ సంబంధానికి దారి తీసే పరిస్థితుల గురించి మన జీవితమే ఆధారపడి ఉంటుంది. వ్యక్తి బాధ్యతలు పూర్తి చేసుకున్న తరువాత లైంగిక జీవితంపై ఆసక్తి పెరుగుతుంది. కానీ వారి మధ్య అలాంటి సంబంధం బలపడాలంటే ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలి. లేకపోతే ఇద్దరికి ఇబ్బందులు ఎదురవుతాయి.

భార్యాభర్తల మధ్య అనుబంధం పెరిగితే ప్రేమ చిగురిస్తుంది. లేకపోతే బాంధవ్యాలు బాగుపడవు. బిడ్డ పుట్టిన తరువాత స్త్రీ ప్రేమ సంతానం వైపు మళ్లుతుంది. దీంతో భర్తను అంతగా పట్టించుకోరు. ఇక్కడే వివాహేతర సంబంధాలు ఏర్పడతాయి. ఆ ప్రేమ బంధంగా మారితే అంతే సంగతి.

సంసారంలో ఎప్పుడు ఏదో ఒక గొడవ జరిగితే మనశ్శాంతి కోసం వివాహేతర సంబంధాల కోసం చూస్తుంటారు. దంపతుల మధ్య విశ్వాసం కోల్పోతే వారి మధ్య అనుబంధం దెబ్బతింటుంది. వివాహేతర సంబంధానికి దారి తీస్తుంది. ప్రేమకు నమ్మకమే పునాది అనుమానం సమాధి. ఇద్దరి మధ్య అనురాగం వెల్లివిరియాలంటే నమ్మకం ఉండాలి.
Recommended Video:
వేసవిలో బీర్లు తాగేటప్పుడు ఇవి తింటున్నారా..? || Do not eat these foods while drinking Beer

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version