Chanakya Niti : వ్యక్తిగత జీవితం బాగుండాలని కోరుకునే వారు నేటి కాలంలో చాలామంది వివిధ మార్గాల ద్వారా జీవితం పై అవగాహన పెంచుకుంటున్నారు. అయితే అపర చాణక్యుడు మౌర్య సామ్రాజ్యకాలంలోనే వ్యక్తుల జీవితాల గురించి.. కొన్ని సూత్రాలను తెలియజేశాడు. నాటి నుంచి నేటి వరకు చాలామంది వీటిని ఫాలో అవుతూ తమ జీవితాలను ఆనందమయంగా చేసుకుంటున్నారు. అయితే చాణక్య నీతి ప్రకారం కొన్ని ప్రదేశాలను సందర్శించడం వల్ల వారి జీవితం నష్టానికి గురి చేస్తుందని చెప్పాడు. మనం ప్రతిరోజు ఎక్కడెక్కడో వెళ్తుంటాం. కొన్నిచోట్ల లాభాలు జరుగుతే.. మరికొన్ని చోట్ల నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే నష్టాలు జరిగే ప్రదేశాలను చాణక్యుడు ముందే తెలియజేశాడు.. అవేంటో చూద్దాం..
Also Read : పొరపాటున కూడా వీరిని ఇంటికి పిలవద్దు.. ఎందుకంటే?
ఉపాధి లభించని చోటు:
ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. ఉద్యోగం చేయకపోయినా ఏదైనా ఉపాధి తోనైనా జీవించడం తప్పనిసరి. అయితే కొందరికి పుట్టిన ఊరులో ఉపాధి ఉండదు. దీంతో డబ్బు సంపాదించడానికి ఇతర మార్గాలకు వెళుతూ ఉంటారు. ఇలా వెళ్లినవారు అక్కడ డబ్బు సంపాదించలేమని తెలుసుకున్నట్లయితే ఆ ప్రదేశాన్ని వెంటనే విడిచి పెట్టాలి. మరోసారి ఆ ప్రదేశానికి వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఉండడంవల్ల ఎప్పటికీ ఉపాధి లభించే అవకాశం ఉండదు. దీంతో సమయం వృధా అవుతుంది.
గౌరవం లభించని ప్రదేశం:
కొందరి మనసులను కలవడం వల్ల మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. మరికొందరిని కలవడం వల్ల చికాకు కలుగుతుంది. వీరిలో కొందరు గౌరవాన్ని ఇస్తారు. వారు తీసుకుంటారు. ఇలాంటి గౌరవం లేని ప్రదేశాలకు వెళ్లడం మంచిది కాదని చాణక్య నీతి తెలుపుతుంది. అలాగే గౌరవం, మర్యాదలు లేని వ్యక్తులతో మాట్లాడడం కూడా సమయం వృథా అని పేర్కొంటున్నాడు.
విద్య లేని ప్రదేశం:
నేటి కాలంలో చదువు లేకపోతే జీవితం గడవడం కష్టంగా మారింది. అందువల్ల ప్రతి ఒక్కరూ చదువు కోవాలని చెబుతున్నాను. అయితే చదువు లభించని ప్రదేశంలో ఉండడం వల్ల జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల విద్య లేని ప్రదేశానికి వెళ్లడం.. అక్కడ జీవించడం నష్టమేనని చాణక్యనీతి పేర్కొంటుంది. ఇలాంటి ప్రదేశం ఉన్నట్లయితే వెంటనే వీడి విద్య ఉన్న చోటుకు వెళ్లడం మంచిదని చాణక్య నీతి తెలుపుతుంది.
సహకారం లేని వాతావరణంలో..
మనసులు ఎక్కడ ఉన్నా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని ప్రదేశాల్లో ఎవరికి వారే అన్నట్లుగా ఉంటారు. ఇలాంటి ప్రదేశంలో జీవించడం సమయం వృథా అని చాణక్యనీతి తెలుపుతుంది. సహకారం ఇచ్చిన ప్రదేశంలో ఉండడంవల్ల జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. అందువల్ల ఇటువంటి ప్రదేశంలో ఉన్నట్లు భావిస్తే వెంటనే ఆ ప్రదేశాన్ని వీడాలి.
సంస్కారం లేని చోటు..
ఈ భూమి మీద ఉన్న వారు వారి సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. సాంప్రదాయాల ద్వారా సంస్కారం తెలుస్తుంది. ఒక మనిషి జీవితాన్ని ఉన్నత స్థితి చేరుకోవడానికి సంస్కారం ఎంతో అవసరం. కానీ సంస్కారం లభించని చోటులో జీవించడం సమయం వృథా అని చాణక్యనీతి తెలుపుతుంది. ఈ ప్రదేశంలో ఉండడం వల్ల సక్రమమైన జీవితం కొనసాగదు అని తెలుపుతుంది.
Also Read: చాణక్య నీతి ఆడవారిలో ఈ లక్షణాలు ఉంటే మగవాళ్ళు వెంటనే ఇష్టపడతారు… అవేంటంటే?