Chanakya Niti: అపర చాణక్యుడు రాజనీతి శాస్త్రమే కాకుండా నీతి శాస్త్రాన్ని కూడా తెలియజేసి మనుషుల జీవితాలను చక్కబెట్టారు. మానవుల జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఎలా జీవించాలి? ఎవరితో స్నేహం చేయాలి? ఎవరితో కలిసి ఉండాలి? అనేవి జీవితంలో చాలా ముఖ్యమని చాణక్య నీతి శాస్త్రం తెలుపుతుంది. అయితే కొందరు వ్యక్తుల వల్ల మేలు కలగవచ్చు. మరికొందరి వల్ల హాని కలగవచ్చు. కానీ నిత్యం మనతో కలిసి ఉండే కొందరు వ్యక్తుల్లో ఇలాంటి లక్షణాలు ఉంటే వారిని వెంటనే దూరం పెట్టాలని చాణక్యుడు పేర్కొన్నారు. అంతేకాకుండా పొరపాటున కూడా వీరిని ఇంటికి పిలవద్దని చాణక్య నీతి తెలుపుతుంది. మరి వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
కొంతమందికి ఎప్పుడూ ఇతరులను మోసం చేయాలని గుణం ఉంటుంది. వారు ఇతరులను చీటింగ్ చేసే ఎక్కువగా లాభం పొందుతారు. ఇలాంటివారు పైకి కనిపించకపోయినా వారి ప్రవర్తన బట్టి తెలుసుకోవాలి. ఆ వ్యక్తులతో ఇప్పటివరకు స్నేహం చేసినా మెల్లిగా వదులుకోవాలి. అంతేకాకుండా పొరపాటున ఇలాంటి వ్యక్తులను ఇంటికి కూడా పిలవవద్దు. అలా చేస్తే ఆ వ్యక్తి జీవితం పైనే కాకుండా కుటుంబం పై కూడా ప్రభావం పడుతుంది. అందువల్ల ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి.
కొందరు ఎప్పుడూ తమకు కష్టం కలుగుతుందని చెబుతూ ఉంటారు. అలాగే నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు కూడా దూరంగా ఉండటమే మంచిది. నెగిటివ్ వ్యాఖ్యలు చేసేవారు మనం చేసే కొన్ని పనుల్లో కూడా నెగిటివ్ తో ఆలోచిస్తారు. అలాగే మన పనులకు వారు అడ్డంకులు సృష్టిస్తారు. అందువల్ల ఇలాంటి వారిని దూరం చేసుకోవడమే మంచిది. అంతేకాకుండా వారిని ఎట్టి పరిస్థితిలో ఇంట్లోకి ఆహ్వానించద్దు.
కొందరు తమకు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఇతరులను వాడుకుంటూ ఉంటారు. వారి పని పూర్తయిన తర్వాత స్నేహాన్ని కూడా కట్ చేస్తారు. అలాంటి వారితో స్నేహం చేయడం చాలా ప్రమాదకరం. అవకాశాలను మాత్రమే ఉపయోగించి స్నేహం చేసేవారితో ఉండడంవల్ల ఇప్పటికైనా ప్రమాదకరమే. ఇలాంటి వ్యక్తులను తొందరగా దూరం చేసుకోవడమే మంచిది. వారికి అవసరం ఉన్నప్పుడల్లా దగ్గర చేరి.. మిగతా సమయంలో పట్టించుకోకుండా ఉంటారు. పొరపాటున కూడా ఇలాంటి వారిని ఇంటికి ఆహ్వానించద్దు.
సమాజంలో ధర్మం గురించి తెలియని చాలామంది వ్యక్తులు ఉన్నారు. మీరు తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ఇతరులకు నష్టం చేకూరుస్తారు. అయితే ఒక్కోసారి వారితో స్నేహం చేయడం వల్ల పక్కవారిని పట్టించుకోకుండా వారికి నష్టం చేకూర్చే పనులు చేస్తారు. వీరితో స్నేహంగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యనీతి తెలుపుతుంది. వీరిని కూడా పొరపాటున కూడా ఇంటికి పిలవకుండా జాగ్రత్తపడాలి.
కొందరు అతి తెలివి ప్రవర్తనతో ఇతరులను ఎప్పటికీ మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి దూరంగా ఉండాలని చాణక్యనీతి తెలుపుతుంది. తమ గొప్పతనం కోసం ఇతరులను మోసం చేయడానికి అయినా వెనుకాడరు. వీరిని పొరపాటున కూడా ఇంటికి ఆహ్వానించడం వల్ల ఆశుభాలే ఉంటాయి.