Lunch : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా అవసరమే. ఎందుకంటే వాతావరణ కాలుష్యంతో పాటు ఆహారం రకరకాలుగా కల్తీ మయంగా మారుతుంది. ఈ క్రమంలో నాణ్యమైన ఆహారం తినడం చాలా అవసరం. కొన్ని ఆహార పదార్థాల్లో ప్రోటీన్లు ఉంటాయి. కానీ అవి తినడం వల్ల కొందరికి అనారోగ్యాన్ని చేకూరుస్తాయి. అందువల్ల తీసుకునే ఆహారంలో అనారోగ్యానికి గురి చేసేవి కాకుండా కేవలం ప్రోటీన్లు లభించే వాటిని మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో కొందరు ఇష్టం వచ్చినట్లు తింటూ ఉంటారు. కానీ ఈ సమయంలో చేసే భోజనం కూడా చాలా ప్రధానమైనది. ఈ సమయంలో ఎటువంటి భోజనం తీసుకోవాలంటే?
Also Read : పుచ్చకాయను ఫ్రిజ్లో ఉంచి తింటున్నారా..? ఏం జరుగుతుందో తెలుసా?
ప్రతి వ్యక్తి మూడు పూటలా భోజనం చేస్తూ ఉంటాడు. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మరోసారి భోజనం చేస్తూ ఉంటారు. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసే సమయంలో భోజనం కాకుండా ఇతర పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం మాత్రం రైస్ తో కూడిన భోజనం చేస్తారు.. అయితే రెగ్యులర్ గా రైస్ తో తినే ఆహారం వల్ల కొందరు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. దీంతో చాలామంది రైసును తీసుకుంటూ లావు అవుతున్నారు. మరికొందరు పిండి పదార్థాలు శరీరంలో ఎక్కువై అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే మధ్యాహ్నం భోజనం తప్పనిసరి కాబట్టి రైస్ కచ్చితంగా ఉంటుంది. కానీ రైస్ తో పాటు మిగతా పదార్థాలను తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో రైస్ తో ఆహారం చేసేవారు వీటికి తోడుగా సలాడ్స్ కూడా తీసుకోవాలి. అయితే వీలైతే తెల్లని రైస్ కంటే బ్రౌన్ రైస్ తినడం చాలా బెటర్. అంతేకాకుండా క్వినోవా లేదా తృణధాన్యాలు వంటి ఆహారం చేర్చుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇదే సమయంలో ఫైబర్ కంటెంట్ కలిగిన కూరలను వాడడం మంచిది. కేవలం తెల్లని రైస్ తో పాటు ప్రాసెస్ చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలతో పాటు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. అందువల్ల మధ్యాహ్నం భోజన సమయంలో కూడా ప్రాసెస్ కొడుకు దూరంగా ఉండటమే మంచిది.
అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రించకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల దిన సమస్యలు ఎదుర్కొని లావు అయ్యే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం మసాలా కలిగిన కంటెంట్ తినడం వల్ల అల్సర్ తయారయ్యే అవకాశం ఉంటుంది. కొందరు టెస్ట్ కోసం మధ్యాహ్న భోజనంలో రకరకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. కానీ భోజనం తర్వాత పెరుగు లేదా చల్లదనం ఇచ్చే పదార్థాలను తీసుకోవడం మంచిది. వేసవికాలంలో ఇలా చేయడం వల్ల ఎండ వేడి నుంచి తట్టుకునే అవకాశం ఉంటుంది. మధ్యాహ్న సమయంలో వేసవిలో ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల బయటకు వెళ్లాల్సి వస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల మధ్యాహ్న భోజనం సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.