Chanakya Niti: భార్యభర్తల మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలి?

ప్రేమ వివాహంలో అయినా పెద్దల ఫోర్స్ వల్ల అయినా కూడా పురుషులకు ఎక్కువగా ఏజ్ ఉంటే ఆ బంధం సంతోషంగా ఉండదు అంటున్నారు చాణక్యుడు. భార్యభర్తల మధ్య వయసు గ్యాప్ ఎక్కువ ఉంటే జీవితాన్ని సర్దుబాటు చేసుకుంటూ గడపాల్సిందేనట.

Written By: Swathi, Updated On : March 23, 2024 7:15 pm

Chanakya Niti

Follow us on

Chanakya Niti: ఈ మధ్య పెళ్లి చేసుకోవడానికి ఏజ్ గ్యాప్ ను ఎక్కువగా చూడడం లేదు. బాల్య వివాహాలు చేసుకున్నప్పటి రోజులు ఒకలాంటివి అయితే.. ప్రస్తుతం వధువు, వరుడు మధ్య కూడా ఏజ్ గ్యాప్ మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రేమ మధ్య కూడా ఏజ్ గ్యాప్ లేకుండా ఉండడం గమనార్హం. మరి ఈ గ్యాప్ గురించి పట్టించుకోకుండా పెళ్లి చేసుకుంటే చాలా సమస్యలు వస్తాయట. ఇంతకీ వీటి గురించి చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం.

ప్రేమ వివాహంలో అయినా పెద్దల ఫోర్స్ వల్ల అయినా కూడా పురుషులకు ఎక్కువగా ఏజ్ ఉంటే ఆ బంధం సంతోషంగా ఉండదు అంటున్నారు చాణక్యుడు. భార్యభర్తల మధ్య వయసు గ్యాప్ ఎక్కువ ఉంటే జీవితాన్ని సర్దుబాటు చేసుకుంటూ గడపాల్సిందేనట. వృద్ధుడిని పెళ్లి చేసుకోకూడదు అని సలహా ఇచ్చారు చాణక్యుడు. జనరేషన్ గ్యాప్ ఉంటే వారి మధ్య ఆలోచనలు, చర్యల మధ్య కూడా తేడా ఉండి ఆనందం ఉండదట.

భార్య ఏం చేసినా భర్తకు ఇష్టం ఉండదట. భర్త ఏం చేసినా భార్యకు నచ్చదట. భార్య ఏదైనా నేర్చుకొని ఉద్యోగంలో చేరితే.. ఏదో ఒకరకంగా దూషిస్తూ ఉంటాడట భర్త. ఇలాంటి ప్రవర్తన ఉంటే భార్య కూడా విసిగిపోతుందని తెలిపారు చాణక్యుడు. ఇలా గ్యాప్ ఉంటే ఇద్దరికి ఇద్దరు గౌరవం ఇచ్చుకోరు అని తెలుస్తోంది. ఎవరు చేసిన పని వారికే కరెక్ట్ అనిపిస్తుందట. అందుకే ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండకూడదు అంటున్నారు చాణక్యుడు.

ఇద్దరిలో ఒకరు సర్దుకు పోవాలి అనుకున్నా కూడా ఆ బంధం ఆనందంగా ఉండదట. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడే అన్ని వివరాలు తెలుసుకొని పెళ్లి చేసుకోవాలి అని.. ఆ తర్వాత కలతల విషయంలో టెన్షన్ ఉండదని అంటున్నారు చాణక్యుడు.