Nagababu: జనసేన నేత,మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు.సెటైరికల్ కామెంట్స్ చేస్తుంటారు.ఆయన కామెంట్స్ చాలా సార్లు వైరల్ అయ్యాయి. వివాదాస్పదంగా మారాయి. నాకు బాలయ్య అంటే ఎవరో తెలీదు అంటూ పాత కాలం నాటి నటుడి ఫోటో పెట్టి మరి కామెంట్స్ చేశారు. అప్పట్లో అది పెను దుమారానికి దారితీసింది. అదే నాగబాబు తాజాగా ఎక్స్ వేదికగా మరో బాంబు పేల్చారు. ఆసక్తికర ట్విట్ చేశారు. చంద్రబాబు పైనే సెటైర్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఇదో వైరల్ అంశంగా మారింది. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
చిరంజీవి కుటుంబంలో చంద్రబాబు అంటే అంతగా పడదు.కానీ పవన్ మాత్రం అభిమానిస్తారు. గౌరవంగా చూసుకుంటున్నారు. అయితే జనసేన పేరుకే పవన్ కానీ.. అన్ని వ్యవహారాలు చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నాయి అన్న విమర్శలు ఉన్నాయి.జనసేనకు కేటాయించిన సీట్లలో సైతం చంద్రబాబు పెత్తనం పెరిగింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ ను మేనేజ్ చేసి చంద్రబాబు జనసేన ను తొక్కిస్తున్నారన్న టాక్ కూడా ఉంది. అటు అనకాపల్లి లోక్సభ స్థానం నాగబాబుకు దక్కినట్టే దక్కి.. బిజెపికి కేటాయించడంతో ఆయనను అవమానించారని కూడా ఒక రకమైన ప్రచారం జరుగుతోంది. దీనిపై నాగబాబు నొచ్చుకున్నారని.. అసంతృప్తితో హైదరాబాద్ వెళ్లిపోయారని కూడా టాక్ నడిచింది. ఇటీవలే మళ్లీ నాగబాబు బయటకు వచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
తాజాగా నాగబాబు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యను చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా దానిని పంచుకున్నారు.’ వయసు ఎక్కువ. పెద్దవాడు అని. ప్రతి వెధవను గౌరవించనక్కరలేదు. ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్ళు అవుతారు’ అంటూ చైనీస్ తత్వవేత్త కన్ఫ్యూజియస్ నినాదాన్ని షేర్ చేశారు. దీంతో ఇది చంద్రబాబును ఉద్దేశించి చేసిన కామెంట్ అని ప్రచారం జరుగుతోంది. దీనిపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు పై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. నాగబాబు కామెంట్స్ పొత్తు ధర్మాన్ని విఘాతం కలిగించేలా ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.