Chanakya Niti for Success: మనిషి దైనందిన జీవితంలో ప్రతి వారు ఏదో ఒక పని చేస్తుంటారు. బతకడానికి ప్రతి వ్యక్తి ఏదో వృత్తిని ఎంచుకుంటారు. కొందరు వ్యవసాయం చేస్తే మరికొందరు వ్యాపారం చేస్తారు. ఇంకొందరు ఉద్యోగాలు చేస్తారు. అయితే పనులు అందరు చేస్తారు. కానీ వాటిని సరైన పద్ధతిలో చేసే వారికే ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వారినే విజయావకాశాలు పలకరిస్తాయి. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే కూడా మనలో నిత్యం మార్పులు రావాల్సిందే. అందుకోసం మనం మనల్ని మార్చుకోవాల్సిందే.

చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం చేసే పనిపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలని సూచిస్తున్నారు. పని మొదలు పెట్టేటప్పుడు మంచి సమయం చూసుకుని ప్రారంభించి మంచి ముగింపు ఉండేలా చూసుకోవాలి. ఏదైనా పనిని మధ్యలో వదిలేస్తే అసంపూర్ణం అవుతుంది. అందుకే చేసే ప్రతి పని పట్ల మనకు బాధ్యత ఉంటుంది. దాన్ని చేసే క్రమంలో మనకు అవాంతరాలు ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
Also Read: Akhanda 2: అఖండ 2 గురించి అభిమానులకు సెన్సేషనల్ న్యూస్
ఉదయం లేచినప్పుడే మనం ఆ రోజు చేసే పనులను ఓ ప్రణాళిక ప్రకారం చేసేందుకు ఆర్డర్ రూపొందించుకోవాలి. ప్రాధాన్యత క్రమంలో భాగంగా అత్యవసరమైన పనులు మొదట తరువాత మిగిలిన పనులు చేసుకునేలా ఏర్పాట్లు చేసుకుంటే పని సులువు అవుతుంది. ఇలా చేయడం వల్ల మన లక్ష్యాలను చేరుకోవడం సులభం అవుతుంది.

ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మన శరీరం ఆరోగ్యంగా ఉంటేనే పని చేయగలం. అంతేకాని మనం అనారోగ్యానికి గురైతే పనులు చేయడం సాధ్యం కాదు. ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా ఆలోచించాలి. వ్యాధులు రాకుండా ఉంటేనే మనం ఏ పని అయినా చేయగలం. అందులో విజయం సాధించగలమని గుర్తుంచుకోవాలి. దీని కోసమే నిరంతరం ఆలోచించి ముందుకు నడవాల్సి ఉంటుంది.
చేసే పనులు కూడా సమయానికి చేసుకోవాలి. సమయం తప్పితే ఆ పని చేసినా వృథా అవుతుంది. అందుకే మనం చేసే పనిలో సమయపాలన చూసుకోవాలి. అప్పుడే మనకు గౌరవం దక్కుతాయి. సమయాన్ని దుర్వినియోగం చేయకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఎదిగేందుకు తోడ్పడుతుంది. సమయం విలువ తెలుసుకుని మసలుకుంటే మన జీవితం సార్థకం అవుతుందని తెలుసుకోవాలి.
Also Read:YS Jagan- KTR: దావోస్ వేదికగా కేటీఆర్ జగన్ షేక్‌హ్యాండ్!! పుకార్లు షికార్లు!?
Recommended Videos: