Akhanda 2: నందమూరి బాలకృష్ణ హిట్ కొడితే బాక్స్ ఆఫీస్ ఎలా షేక్ అవుతుందో అని చెప్పడానికి మరో ఉదాహరణగా నిలిచినా చిత్రం..గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రకంపనలు ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు..ఇటీవల కాలం లో రాజమౌళి తెరకెక్కించిన #RRR తర్వాత ఆ స్థాయి లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న సినిమా ఇదే..డిసెంబర్ మొదటి వారం లో విడుదల అయినా అఖండ సినిమా, ఈ ఏడాది సంక్రాంతి వరుకు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడించింది..ఇక 50 రోజుల కేంద్రాలు విషయం లో కూడా అఖండ సరికొత్త చరిత్ర సృష్టించింది..OTT కాలం లో ఒక్క సినిమా ఇన్ని కేంద్రాలలో 50 రొజులు ఆడడం అంటే మాములు విషయం కాదు..బాలయ్య – బోయపాటి శ్రీను మాస్ కాంబినేషన్ పవర్ అలాంటిది మరి!.ఇంతతి సంచలన విజయం సాధించిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను ఇదివరకే తెలియచేసిన సంగతి మన అందరికి తెలిసిందే.

Akhanda
అసలే ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సీక్వెల్స్ హవా నడుస్తుంది..ఇటీవలే విడుదల అయినా KGF చాప్టర్ 2 అన్ని బాషలలో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..త్వరలోనే పుష్ప పార్ట్ 2 , మరియు #RRR పార్ట్ 2 కూడా రాబోతున్నాయి అనే విషయం మనకి తెలిసిందే..ఇది ఇలా ఉండగా OTT లో విడుదల అయినా తర్వాత అఖండ సినిమాకి ఉత్తర భారత దేశం లో కూడా అద్భుతమైన రీచ్ వచ్చింది..ముఖ్యంగా క్లైమాక్స్ లో పోరాట సన్నివేశం లో బాలయ్య బాబు లో శివుడు ఆవహించినట్టు చూపించే షాట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..సోషల్ మీడియా లో అడుగడుగునా హిందుత్వం గొప్పతనం ని చాటి చెప్పే విధంగా అఖండ సినిమాని తీర్చి దిద్దినందుకు ఉత్తరాది ప్రేక్షకులు మరియు క్రిటిక్స్ నుండి బోయపాటి శ్రీను పై ప్రశంసల వర్షం కురిసింది..ఈ క్రేజ్ ని పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకునేందుకు ఆ చిత్ర నిర్మాత రవీందర్ రెడ్డి ఈసారి అఖండ 2 ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు అట.
Also Read: YS Jagan- KTR: దావోస్ వేదికగా కేటీఆర్ జగన్ షేక్‌హ్యాండ్!! పుకార్లు షికార్లు!?
ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో లేటెస్ట్ న్యూస్ ఏమిటి అంటే ఈ ఏడాది చివర్లోనే అఖండ పార్ట్ 2 ని సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు డైరెక్టర్ బోయపాటి శ్రీను సన్నాహాలు చేస్తున్నాడు అట..ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసిన బోయపాటి శ్రీను..స్క్రిప్ట్ కి సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ ని బాలయ్య బాబు కి త్వరలోనే వినిపించబోతున్నాడు అట..ప్రస్తుతం హీరో రామ్ తో సినిమా చెయ్యబోతున్న బోయపాటి శ్రీను, ఈ చిత్రం పూర్తి అవ్వగానే బాలయ్య బాబు తో అఖండ సీక్వెల్ ని తియ్యబోతున్నాడట..వాస్తవానికి అఖండ సీక్వెల్ కంటే ముందుగా బాలయ్య బాబు తో ఒక్క పొలిటికల్ సబ్జెక్టు ని ప్లాన్ చేసుకున్నాడు బోయపాటి శ్రీను..కానీ ఆ ప్రాజెక్ట్ కరెక్టుగా ఎన్నికల సమయం లో విడుదల అయ్యేలా ప్లాన్ చేసి ఈలోపు అఖండ పార్ట్ 2 తో అభిమానులను అలరించేదానికి మన ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతుంది..చూడాలి మరి పార్ట్ 1 రేంజ్ లో పార్ట్ 2 కూడా అలరిస్తుందో లేదో అనేది.
Also Read: Ram Gopal Varma- Cheating Case: వర్మ పై 420 కేసు.. అలాగే మరో మూడో కేసులు కూడా !
Recommended videos