Chanakya Niti Relationship: చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు చెప్పాడు. జీవితంలో మనం ఎలా ఉండాలో? ఎలా ఉండూడదో స్పష్టంగా సూచించాడు. డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, నీతి, వైవాహిక జీవితం, సమాజం ఇలా అన్ని విషయాల్లో ఎంతో స్పష్టమైన సమాచారం అందించాడు. ఆయన సూచించిన మార్గాలు పాటిస్తే మనకు జీవితంలో ఎలాంటి చిక్కులు ఎదురుకావు. ఎలాంటి ఆపదనైనా చిటికెలో పరిష్కరించే పరమ సత్యాలను మనకు బోధించాడు. తన ఆలోచనలు అలా ఉండేవి. అందుకే చంద్రగుప్తుని రాజును చేయడంలో చాణక్యుడి పాత్ర ఎంతో ఉంది. ఇలా జీవితంపై తనదైన శైలిలో పరిష్కారాలు చూపి తత్వవేత్తగా మారాడు. అందరికి సందర్భోచిత మార్గాలు అన్వయించాడు.

భార్యాభర్తల సంబంధాల్లో చాణక్యుడు ఎన్నో విషయాలు వివరించాడు. చాణక్య నీతి ప్రకారం భార్యలు తమ భర్తల నుంచి ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలు దాస్తారట. ఆ రహస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తలతో చర్చించరు. దంపతుల మధ్య వైవాహిక బంధం బలోపేతం కావడం కోసమే వారు ఈ విషయాలు వెల్లడించరని చెబుతారు. వారి సంతోషానికి అడ్డు వచ్చే ఎలాంటి విషయాన్ని అయినా దాచిపెడతారు. ఇద్దరికి పనికొచ్చే విషయమైతే వెంటనే చెప్పేస్తారు. అది వారి నైజం. ఆడవారి నోట్లో ఆవగింజంత రహస్యం కూడా దాగదంటారు.
వివాహానికి ముందు జరిగే పనులు రహస్యంగా ఉంచుతుంది. ఎందుకంటే వాటితో భర్తలకు లేనిపోని అనుమానాలు వస్తాయనే ఉద్దేశంతో పెళ్లికి ముందు జీవితం గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాస్తవాలు చెప్పరు. తన భర్త జీవితాంతం తనతోనే ఉండాలనే కారణంతో అలా చేస్తారని చాణక్యుడు చెబుతున్నాడు. పెళ్లి తరువాత భర్త తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటుంది. భర్త సంతోషమే తన సంతోషంగా భావిస్తుంది. ఇంట్లో గొడవలు రాకుండా చూసుకుని జాగ్రత్తగా మసలుకుంటుంది.

ఎన్నో విషయాలు భార్యలు భర్తలకు చెప్పరు. ఇంటి ఖర్చుల విషయంలో కూడా తన దగ్గర ఉన్న ఆదాయంతోనే సర్దుకుంటుంది. ఇంకా ఎక్కువ కావాల్సి ఉన్నా అడగదు. భార్యకు ఏదైనా జబ్బు చేసినా చెప్పదు. చెబితే ఆస్పత్రుల చుట్టు తిరగాల్సి వస్తుందని భయపడి దాచిపెడుతుంది. దీంతో రోగం బయట పడిన తరువాత ఇంకా పెద్ద ఖర్చు ఉంటుందని తెలిసినా తన కుటుంబ క్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడదు. అందుకే ఆడదాన్ని భూదేవిగా అభివర్ణిస్తారు. ఇలా ఆడవారు మగవారికి ఎన్నో విషయాలు దాచిపెట్టి సంసార బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం పరిపాటే. చాణక్యుడు వీటి గురించి ఎంతో విపులంగా చెప్పాడు.