Tomato Health Benefits మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో టమాట ప్రధానమైనది. అందుకే దీన్ని విరివిగా ఉపయోగిస్తాం. అన్ని కూరల్లో వాడతాం. ఏ కూర లేకుంటే టమాట కూర కూడా చేసుకోవడం సహజమే. టమాటాల్లో చాలా పోషకాలు ఉన్నాయి. అవి మన దేహానికి ఎంతో మేలు చేస్తాయనడలో సందేహం లేదు. దీంతో టమాటాల వినియోగం పెరిగిపోయింది. కొన్ని సందర్భాల్లో టమాట ధర కేవలం రూ.10 లే ఉండటం గమనార్హం. ఒక్కోసారి రూ. 50 నుంచి 100 వరకు పలికిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇలా టమాట మన జీవితంలో ప్రధాన భాగంగా నిలిచిపోయింది. అందుకే దాన్ని మనం విడిచి కూర చేసుకోలేం. చివరకు చికెన్ వండాలన్నా టమాట ఉండాల్సిందే. అంతటి ప్రాధాన్యం మనం దీనికి ఇస్తున్నాం.

ఇందులో హైబ్రిడ్, లోకల్ అని రెండు ఉంటాయి. లోకల్ టమాట పుల్లగా ఉంటుంది. కూరల్లో వేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. హైబ్రిడ్ టమాటాల తోలు కాస్త మందంగా ఉంటుంది. ఇవి త్వరగా ఉడకవు. కూర కూడా రుచి వేరుగా ఉంటుంది. అందుకే లోకల్ టమాటాలు తీసుకుంటే బాగుంటాయి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. అందుకేు పలు రోగాలకు చెక్ పెడతాయి. క్యాన్సర్ ను దూరం చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి.
టమాటాల్లో బీటా కెరోటిన్ ఉండడం వల్ల పేగు క్యాన్సర్ రాకుండా చేస్తాయి. ప్రొస్టేట్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయి. ఇందులో ఉండే పీచు, పొటాషియం, విటమిన్ సి, కోలిన్ అన్ని గుండెకు మేలు చేస్తాయి. పొటాషియం సోడియం సోడియం తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. వీటిలో ఫోలేట్ కూడా ఉంటుంది. దీంతో హోమసిస్టీన్ అనే ప్రొటీన్ విచ్చిన్నం వల్ల కలిగే అమైన ఆమ్లం గుండెపోటు రాకుండా చేస్తుంది. టమాటాలు మన శరీరం హైడ్రేడ్ గా ఉంచుతాయి. పేగు కదలికలను మెరుగ్గా ఉంచుతాయి.

టమాటాల్లో లైకోపీస్, లుటిన్, బీటాకెరోటిన్ పుష్కలంగా ఉండటంతో కంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండటంలో టమాటాల పాత్ర కూడా కీలకమే. కెరోటినాయిడ్లు లుటిన్, జియాక్సంతిన్ కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చేయడంలో దోహదపడతాయి. ఇన్ని లాభాలున్న టమాటాలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మనకు చాలా రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అందుకే టమాటాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.