PM Modi- KCR: ఎన్నికలకు మరికొన్ని నెలలు గడువు ఉన్నప్పటికీ.. తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకుంటున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చారు.. ఇందులో భాగంగానే ఆ పార్టీ పుట్టిన తెలంగాణ ప్రాంతాని కంటే ముందుగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షున్ని నియమించారు. అంతేకాకుండా ఈనెల 18న ఖమ్మంలో సుమారు నాలుగు లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేరళ, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు వినరయి విజయన్, భగవంత్ సింగ్ మాన్, అరవింద్ కేజ్రివాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరుకానున్నారు. వీరితోపాటు భద్రాచలం సరిహద్దున ఉన్న ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా హాజరయ్యే అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు క్రమంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో మైదానాన్ని చదును చేస్తున్నారు.. నాలుగు లక్షల దాకా ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

19న మోడీ రాక
ఇక కెసిఆర్ సభ ముగిసిన అనంతరం అంటే మరుసటి రోజు జనవరి 19న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్నారు.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభిస్తారు.. అదేవిధంగా 4000 కోట్ల ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తారు.. మరో మూడు వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహిస్తారు.. ఈ సభకు భారీగా జనాన్ని తరలించేందుకు బిజెపి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై నరేంద్ర మోడీ విరుచుకుపడతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు కేసీఆర్ పాలనపై నర్మగర్భంగా వ్యాఖ్యానించిన మోడీ.. సికింద్రాబాద్ వేదికగా డైరెక్ట్ అటాక్ చేస్తారని తెలుస్తోంది.
మోడీ జాతికి అంకితం చేయబోయే ప్రాజెక్టులు ఇవే
జనవరి 19న తన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి మోడీ సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు.. సికింద్రాబాద్, మహబూబ్ నగర్ మధ్య చేపట్టిన రైల్వే డంబ్లింగ్ పనులను జాతికి అంకితం చేస్తారు.. హైదరాబాద్ ఐఐటి అకాడమిక్, హాస్టల్ భవనాలు, రీసెర్చ్ పార్కును జాతికి అంకితం చేస్తారు..
అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, కాజీపేట రైల్వే వర్క్ షాప్, మహబూబ్ నగర్, చించోలీ జాతీయ రహదారి విస్తరణ, నిజాంపేట, నారాయణఖేడ్, బీదర్ సెక్షన్లో రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు..
రాజకీయంగా ప్రాధాన్యత
ఈనెల 18న అధికార భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభ నిర్వహించనుండటం, మరుసటి రోజే మోడీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రాధాన్యం సంతరించుకుంది.. ఈడ అదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో తరచుగా పర్యటించాలని ప్రధాని మోడీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత నవంబర్ లోనూ మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పర్యటన సందర్భంగా 6000 కోట్లతో పునరుద్ధరించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. ఇక ఈనెల 19 ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలును ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో ప్రధానమంత్రి కార్యక్రమాలు మొదలవుతాయి.. అక్కడే రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు మోడీ భూమి పూజ చేస్తారు. అనంతరం నేరుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని సభలో మిగతా ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

భారీగా కసరత్తు
ఖమ్మం సభకు నాలుగు లక్షల మందిని సమీకరించాలని అధికార భారత రాష్ట్ర సమితి యోచిస్తున్న నేపథ్యంలో… సికింద్రాబాద్లో జరిగే సభకు 50 వేల మందిని తరలించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత ఏ డాది జూలై మొదటి వారంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా భారీ సభను నిర్వహించిన విషయం తెలిసిందే.. యాదృచ్ఛికమే అయినా ఇప్పుడు మళ్లీ జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత బహిరంగ సభకు పరేడ్ గ్రౌండ్ వేదిక అవుతోందని బిజెపి నాయకులు అంటున్నారు.. ఈ సభతో మోడీ ఎన్నికల శంఖారావం పూరిస్తారని, ఆ తర్వాత రాష్ట్రంలో నరేంద్ర మోడీతోపాటు బిజెపి అగ్ర నేతలు తరచుగా పర్యటిస్తారని వారు చెబుతున్నారు.. మొత్తానికి ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో అటు భారత రాష్ట్ర సమితి, ఇటు భారతీయ జనతా పార్టీ ముందుగానే ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.