CBSE Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆఫ్ సెకండరీ ఎడ్యేకేషన్ (CBSE) ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం మీద 87.33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కోవిడ్ కు ముందు పోలిస్తే ఇప్పుుడు ఫలితాలు మెరుగయ్యాయని సీబీఎస్ ఈ అధికారులు వెల్లడించారు. ముందుగా సీబీఎస్ ఈ పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే 12 వ తరగతి రిజల్ట్ ఇచ్చారు. రూల్ నెంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు ఇలా ఏదేనీ ద్వారా నైనా ఫలితాలను cbse.gov.in.https:/chseresults.nic.in/లో చెక్ చేసుకోవచ్చు. అలాగే డిజలీలాకర్, ఉమాంగ్ యాప్ లల్లో కూడా ఫలితాలను చూడొచ్చు.
సీబీఎస్ ఈ బోర్డు పదో తరగతి పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు నిర్వహించారు. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలకు 21 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే 12వ తరగతి పరీక్షలను 12 లక్షల మంది రాశారు. పరీక్షలు పూర్తయిన తరువాత ఫలితాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఫలితాలు విడుదల కావడంతో పాసయిన వారిలో ఆనందం వెల్లి విరుస్తోంది.
సీబీఎస్ ఈ విడుదలయిన ఫలితాల్లో 93.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది పోలిస్తే ఈ సారి ఉత్తీర్ణత శాతం 1.28 శాతం తగ్గింది. అత్యధికంగా తిరువనంతపురంలో 99.91 శాతం, బెంగుళూరులో 99.18 శాతం, చెన్నైలో 99.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 1,95,799 మంది విద్యార్థులు 90 శాతం కంటే ఎక్కువగా మార్కులు వచ్చాయి. ఇక 44,297 మంది 95 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చినట్లు సీబీఎస్ ఈ బోర్డు అధికారులు తెలిపారు.
విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పడంతోనే ఉత్తమ ఫలితాలు వచ్చాయని సీబీఎస్ తెలిపింది. ఇక ఈసారి ఫస్ట్, సెకండ్, థర్డ్ డివిజన్ లు ఇవ్వడం లేదని, ఇలా ఇస్తే ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. అయితే టాపర్స్ కు మాత్రం మెరిట్ సర్టిఫికెట్స్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తరువాత వివరాలు అందించి ఫలితాలను తెలుసుకోవచ్చు.