Car buying tips for new employees: జీవితంలో హాయిగా బతకాలని అందరూ అనుకుంటారు. అందుకోసం డబ్బు అయితే చాలా అవసరం ఉంటుంది. కానీ ఆదాయం తక్కువ ఉన్నవారు ధనవంతులతో పోటీ పడుతూ లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలని చూస్తారు. ఈ క్రమంలో తక్కువ ఆదాయం వస్తున్నా.. అంతకుమించి ఖర్చు చేస్తూ అప్పుల పాలవుతూ ఉంటారు. అసలు అప్పు ఎప్పుడు తీసుకోవాలి? ఏ అవసరాల కోసం అప్పు చేయాలి? కానీ ఇప్పుడు కొంతమంది జనాలు చేస్తున్న అప్పుల వల్ల ఏం జరుగుతుంది?
ఒకప్పుడు సొంత ఇల్లు కట్టుకోవాలంటే కనీసం 50 ఏళ్ల వరకు కష్టపడి.. డబ్బులు కూడా పెట్టుకుని.. ఆ తర్వాత ఇల్లు కట్టుకునేవారు. కానీ ఇప్పుడు 23 ఏళ్ల యువకుడు ఉద్యోగంలో చేరిన తర్వాతే కొత్త ఇల్లును కొనుగోలు చేస్తున్నారు. అయితే తనకు భారీ జీతం వస్తున్న మాట నిజమే కావచ్చు.. కానీ ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఇల్లు కొనుక్కోవడం అనేది కరెక్ట్ కాదని కొంతమంది ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే కొత్తగా ఉద్యోగంలో చేరిన తర్వాత తనకు నెలనెలా జీతం వస్తుందన్న భరోసా ఉంటుంది. కానీ చేతిలో ఏమాత్రం ఆదాయం ఉండదు. ఈ క్రమంలో ఆ వ్యక్తి అప్పులు చేసి లేదా బ్యాంకు రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత ఈఎంఐ ని ఏర్పాటు చేసుకొని నెలలు ఎలా చెల్లించాలని అనుకుంటాడు.
Also Read: ఓయో రూంలో ప్రియుడితో భార్య.. భర్త రాగానే సీన్ చూడాలి
అయితే కొత్తలో ఈఎంఐ చెల్లించడానికి బాగానే ఉంటుంది. కానీ కొన్ని నెలల తర్వాత ఇది భారంగా మారిపోతుంది. ఎందుకంటే కాలం సాగుతున్న కొద్ది ఖర్చులు పెరుగుతాయి.. అవసరాలు పెరుగుతాయి.. ఇందుకోసం డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈఎంఐ నీ చెల్లించడానికి మనసు ఒప్పదు. ఇవే కాకుండా ఏదైనా సందర్భంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడి అత్యధిక డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కూడా ఈఎంఐ చెల్లించే ఆస్కారం ఉండదు.
ఇలా ఒక వ్యక్తి జీవితానికి ఈఎంఐ అనేది పెద్ద భారంగా మారిపోతుంది. అయితే ఈ భారం పడకుండా ఉండాలంటే.. చేతిలో డబ్బు లేనప్పుడు అప్పులు చేసి విలాస వస్తువులు కొనుగోలు చేయొద్దు. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ. 10 లక్షలు పెట్టి కారు కొనాలని అనుకుంటాడు. కానీ అతని దగ్గర లక్ష రూపాయలు మాత్రమే ఉంటాయి. 9 లక్షలు అప్పు చేసి కారు కొంటాడు. ఈ అప్పు తీరేవరకు అతని కారు కూడా పనికిరాకుండా పోతుంది.
Also Read: మీ కుటుంబంలో ఇలాంటి వారు ఉన్నారా? జాగ్రత్త..
ఈ క్రమంలో ఇతను వేరే అవసరాలకు డబ్బులు వెచ్చించడానికి కష్టమవుతుంది. ముఖ్యంగా ఏదైనా వైద్య అవసరాలు ఏర్పడితే ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది. అందువల్ల ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. చేతిలో కనీసం 50% నగదు ఉంటేనే మిగతా 50 శాతం అప్పు చేయాలి. 100% అప్పు చేయడం వలన జీవితం సాగడం కష్టంగా మారుతుంది. అంతేకాకుండా ఆదాయానికి మించి ఖర్చులు చేయడం వల్ల భవిష్యత్తులో డబ్బు లేకుండా పోతుంది.