Homeలైఫ్ స్టైల్No Boil No Oil Cooking: నో బాయిల్‌.. నో ఆయిల్‌.. పొయ్యి వెలగకుండా.. నూనె...

No Boil No Oil Cooking: నో బాయిల్‌.. నో ఆయిల్‌.. పొయ్యి వెలగకుండా.. నూనె వెయ్యకుండా 2 వేల రకాల వంటకాలు!

No Boil No Oil Cooking: పొయ్యి వెలిగించకుండా వంట చేయడం సాధ్యమేనా? రెస్టరెంట్‌కు వెళితే.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొయ్యి వెలుగుతూనే ఉంటుంది. నూనెలు లీటర్లకు లీటర్లు వాడేస్తారు.. నూనెలో తినుబండారాలను అలా అలా దేవేస్తుంటారు.. ఇక మసాలాలు.. దట్టించేస్తుంటారు. వాడిన నూనెనే వాడేస్తుంటారు. ఒకసారి వేడి చేసిన నూనె మళ్లీ వేడి చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కానీ మరిగించిన నూనెనే మనం మళ్లీ మళ్లీ వాడేస్తున్నాం.. అందులో వేయించిన స్నాక్స్, ఫ్రై ఐటంమ్స్‌ లాగించేస్తున్నాం. ఇక ఆరోగ్యం సంగతి అంటారా.. అది ఎప్పుడో మర్చిపోయాం. నాలుక జిహ్వ తీర్చడానికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇకా రోగ్యం అంతే మరి.. ఈనేపథ్యంలోనే ఓ వ్యక్తి అసలు పొయ్యి వెలిగించకుండా.. నూనె వాడకుండా వంట చేయడం మొదలు పెట్టాడు. ఒకటి రెండు వంటకాలు కాదు ఏకంగా 2 వేలకుపైగా వంటకాలు పొయ్యి వెలగకుండా.. నూనె వాడకుండా తయారు చేస్తున్నాడు.

పొయ్యి లేకుండా వంట సాధ్యమేనా?
పొయ్యి వెలగకుండా.. నూనె వాడకుండా వంట సాధ్యమేనా అంటే అవుననే అంటున్నాడు. కేరâ¶ రాష్ట్రం కోయంబత్తూర్‌కు చెందిన శివకుమార్‌. ఈయనకు చిన్నతనం నుంచే వంటచేయడం అంటే ఇష్టం. నమ్మాల్వార్‌ భక్తుడైన శివ పూర్తి శాకాహారి. ఆరోగ్యానికి ఇదో కారణం అని కూడా అంటాడు. కృత్రిమ పదార్థాలు వాడిన ఆహారం తీసుకోకుండా సహజ పద్దతిలో చేసిన ఆహారం తినడమే ఆరోగ్యం అంటారు నమ్మాల్వార్‌. ఆయన బాటలోనే పయనిస్తున్నాడు శివకుమార్‌.

సహజ పద్దతుల్లో రుచికరమైన ఆహారం..
నమ్మాల్వార్‌ సిద్దాంతాన్ని నమ్మిన శివకుమార్‌ సహజ పద్దతుల్లో రుచికరమైన వంటలు ఎందుక తయారు చేయకూడదన్న ఆలోచన వచ్చింది. తాజావూర్, తిరుచ్చి, శివకాశి, కుంభకోణం ప్రాంతాల్లో పొయ్యితో పెద్దగా పనిలేకుండా వంటలు వండేవారు. ఈవిషయం తెలుసుకున్న శివకుమార్‌ వారిదగ్గర శిక్షణ తీసుకున్నాడు. పూర్తిగా పొయ్యి వాడకుండా, ఆయిల్‌ వాడకుండా వంటలు తయారు చేయడంపై ఏడాదిపాటు పరిశోధన చేశాడు. ఆ తర్వాత 30 రకాల వంటకాలు కనిపెట్టాడు.

ఇప్పుడు 2 వేలకు పైగా..
తన పరిశోధనల ద్వారా నో ఆయిల్‌.. నో బాయిల్‌ పద్ధతిలో తయారు చేసే సుమారు 2 వేల రకాల వంటకాలను కనిపెట్టాడు శివకుమార్‌. ఇవన్నీ పొయ్యి వెలగకుండా.. నూన వాడకుండా తయారు చేసేవే.

నో అయిల్‌.. నో బాయిల్‌ రెస్టారెంట్లు..
ఈ క్రమంలో శివకుమార్‌ ఇటీవలే కోయంబత్తూర్‌లో పడయల్‌ నో ఆయిల్‌.. నో బాయిల్‌ పేరుతో రెస్టారెంట్లు ప్రారంభించాడు. వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఆకు కూరలు, బియ్యం, పప్పు ధాన్యాలతో శివ వివిధ రకాల వంటకాలు తయారు చేస్తున్నాడు. సాంబార్, రసంతోపాటు రకరకాల రుచికరమైన వంటకాలను రూ.100 నుంచి రూ.150 కే మీల్స్‌ అందుబాటులోకి తెచ్చాడు.

ఉడికించే పని లేకుండా..
అనేక రకాల వంటకాలను నో ఆయిల్‌.. నోబాయిల్‌ పద్దతిలో తయారు చేస్తున్న శివకుమార్‌ బియ్యాన్ని ఉండికించకుండా కొబ్బరి పాలలో నానబెట్టి తినడానికి వీలుగా తయారు చేస్తారు. ఇక సాంబార్‌ తయారీ విషయానికి వస్తే పప్పును బాగా రుబ్బి అందులో బాదం, జీడిపప్పు మిక్స్‌ కలుపుతారు. రోజుకు 75 మంది శివకుమార్‌ రెస్టారెంట్‌కు వస్తారు.

పది వేల మందికి శిక్షణ..
తాను సాధించిన నైపుణ్యాన్ని శివకుమార్‌ తన స్వార్థానికి వాడుకోవడం లేదు. తాను నేర్చుకున్న విద్యను ఇప్పటి వరకు 10 వేల మందికి నేర్పించారు. దీంతో శివపేరిట ఓ ప్రపంచ రికార్డు నమోదైంది. 2019లో 300 మది విద్యార్థులతో 3:30 నిమిషాల్లో 300 విద్యార్థులతో 300 రకాల వంటకాలు తయారు చేశాడు శివకుమార్‌. పెద్దగా లాభం లేకపోయినా సహజ పద్దతుల్లోనే వంటకాలు చేస్తూ.. కష్టమర్లకు నాణ్యమైన వంటకాలు అందిస్తున్నాడు. అందరూ రోజుకు ఒక్కసారైనా ఆర్గానిక్‌ ఆహారం తీసుకోవాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్లు శివకుమార్‌ తెలిపాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version