India Vs West Indies T20 Series: ఈ నెల 12 నుంచి వెస్టిండీస్ పర్యటనకు వెళ్లబోతున్న భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇప్పటికే టెస్టు, వన్డే జట్లను ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా టి20 సిరీస్ కు సంబంధించిన భారత జట్టును కూడా ప్రకటించింది. ఈ జట్టులో పూర్తిగా యువ ఆటగాళ్లకు సెలక్టర్లు స్థానం కల్పించారు. వెస్టిండీస్ తో టి20 సిరీస్ ఆడనున్న భారత జట్టును హార్దిక్ పాండ్యా నడిపించనన్నాడు. ఈ మార్పులు వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా చేస్తున్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
గత కొంతకాలం నుంచి భారత జట్టుపై గతంలో ఎన్నడూ లేని విధంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెగా టోర్నీల్లో భారత జట్టు విజయం సాధించలేకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్లో భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్, వచ్చే ఏడాది జరగనున్న టి20 వరల్డ్ కప్ లక్ష్యంగా బీసీసీఐ అడుగులు వేస్తోంది. ఇందుకోసం రెండు విభిన్నమైన టీములను సిద్ధం చేస్తోంది. అనుభవజ్ఞులతో కూడిన జట్టును వన్డే వరల్డ్ కప్ కోసం, యువకులతో కూడిన జట్టును టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే వెస్టిండీస్ పర్యటనతో ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది బీసీసీఐ.
పూర్తిగా యువకులతో కూడిన జట్టు..
వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న భారత జట్టులో పూర్తిగా యువకులకు ప్రాధాన్యం కల్పించారు. హార్దిక్ పాండ్యా ముందుండి నడిపించనున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న జట్టులో సభ్యులుగా ఇషాన్ కిషన్, సుబ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్, అక్షర పటేల్, చాహాల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్నోయ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ లతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఆగస్టు మూడు నుంచి ఐదు టి20 మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ ప్రారంభం కానుంది. మిగిలిన ఫార్మాట్లతో పోలిస్తే టి20 ఫార్మాట్ లో వెస్టిండీస్ జట్టు అత్యంత బలమైనది. బలమైన జట్టును సొంత గడ్డపై ఓడించాలంటే యువకులతో కూడిన జట్టు కీలక మన భావించిన బీసీసీఐ ఆదిశగా చర్యలు చేపట్టింది. ఈ సిరీస్ లో మెరుగైన ఫలితాన్ని సాధిస్తే ఇదే టీమ్ తో వన్డే వరల్డ్ కప్ కు భారత జట్టు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదైనా తప్పు జరిగితే మాత్రం ఆ తప్పులను సరిదిద్దుకునేలా మార్పులకు శ్రీకారం చుట్టి టి20 వరల్డ్ కప్ కు జట్టును ఎంపిక చేయనున్నారు.