Sesha Vastralu: మనం అమ్మవారిని పూజిస్తాం. ఆమెకు చీర, జాకెట్, గాజులు, కుంకుమ, పసుపు అమ్మవారికి పెడుతూ ఉంటారు. అమ్మవారు వేసుకున్నాక వాటిని వేలం వేస్తారు. వేలంలో మనం కొనుగోలు చేసుకుని వాడుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ అమ్మవారి చీరలను కట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చీరని పూజారుల చేతికి ఇచ్చి అలంకరణ చేయమని చెబుతాం.
అమ్మవారి చీరను..
అమ్మవారి చీరలను సాధారణ మహిళలు వేసుకోవచ్చా? వేసుకోకూడదా? చాలా మందికి ఈ అనుమానం ఉంటుంది. ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం చెబుతున్నాయి. చీరలను అమ్మవారికి వేశాక వాటిని మనం ధరించవచ్చని చెబుతున్నారు. కొన్ని నిబంధనలు పాటిస్తే అమ్మవారి చీరలను ధరించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈనేపథ్యంలో చీరను ధరించడం ఎలా అని తెలుసుకుంటే మంచిది.
శుక్రవారం చీర కట్టుకుంటే..
అమ్మవారు శేష వస్త్రాన్ని వేసుకునేటప్పుడు తిథి, వర్జ్యం చూసుకుని శుక్రవారం అమ్మవారి చీర కట్టుకోవచ్చు. ఉదయం పూట కొంత సేపు కట్టుకుని విడవాలి. దీంతో ప్రశాంతత లభిస్తుంది. ఆలోచనలు చక్కగా వస్తాయి. రాత్రిపూట కట్టుకోవద్దు. చీర ఉతికిన నీళ్లు మొక్కలకు పోయాలి. చీరను కట్టుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
రాత్రి పూట
శుక్రవారం అమ్మవారిని పూజించడం వల్ల మంచిది. అమ్మవారి ఆశీస్సులు పొందితే అనుకున్నవి నెరవేరతాయి. కోరికలు తీరుతాయి. అమ్మవారి చీరను కట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. కొందరు కట్టుకోకూడదని అంటారు. అందులో నిజం లేదు. అమ్మవారి చీర ధరించడం వల్ల లాభాలుంటాయి. కానీ రాత్రి పూట మాత్రం చీర కట్టుకుంటే మంచిది కాదు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More