Stop Drinking: కొందరి పురుషుల జీవన విధానంలో ఆల్కహాల్ ప్రధానమైపోయింది. ప్రతిరోజూ ఆహరం, టీ పానీయాలు తీసుకున్నట్లే సాయంత్రం ఆల్కహాల్ సేవించనిదే నిద్రకు ఉపక్రమించరు. ఈ క్రమంలో కొందరు అతిగా మద్యం సేవించి మద్యంకు బానిసలుగా మారుతున్నారు. నేటి కాలంలో యవ్వనం వయసు రాగానే కొందరు మితిమీరిన ఆల్కహాలు సేవిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. యుక్త వయసులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల తాత్కాలికంగా ఎటువంటి సమస్య ఉండదు. కానీ భవిష్యత్ లో ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలా కొందరు అతిగా మద్యం సేవించిన వారు ఒక దశలోకి వచ్చిన తరువాత మానేయాలని అనుకుంటారు. కానీ ఒక్కసారిగా మద్యం మానేయడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అసలు ఒక్కసారిగా మద్యం తాగడం మానివేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? మరి మద్యానికి దూరం కావాలంటే ఏం చేయాలి?
నేటి కాలంలో చాలా మంది ఏదో ఒక పనితో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువగా కావడంతో రిలాక్స్ కోసం మద్యాన్ని అలవాటు చేసుకుంటున్నారు. మద్యం సేవించడం వల్ల ప్రశాంత వాతావరణం ఉంటుందని కొందరి ఆలోచన. అలాగే శరీరం అలసట నుంచి విముక్తి పొందుతుందని అంటున్నారు. అయితే దీనిని ఆసరాగా చేసుకొని కొందరు మితంగా మొదలైన మద్యపానం.. ఆ తరువాత మితిమీరిపోతుంది. ప్రతిరోజూ ఆహారంతో పాటు మద్యాన్ని కూడా కచ్చితంగా తీసుకునేవారు కూడా ఉన్నారు.
ప్రతిరోజూ రెండు పెగ్గులు తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యం ఉండదని కొందరు వైద్యులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొంచెం అయినా.. ఎక్కువైనా.. మద్యపానం ఆరోగ్యానికి హానికరమే. అయితే తప్పదు అనుకుంటే 40 ఎంఎల్ తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదని కొందరు ఆరోగ్యం నిపుణులు చెబుతున్నారు. కానీ అనేక ఒత్తిడులు, ఇతర కారణాల వల్ల మద్యానికి బానిక కాకుండా ఉండడం లేదు. అయితే కొన్నాళ్ల తరువాత అనారోగ్యాన బారిన పడితే మద్యం మానేయాలని అనుకుంటారు. కానీ ఒక్కసారిగా మద్యం మానేసినా ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని అంటున్నారు.
ఒక్కసారిగా మద్యం మానేయడం వల్ల ముందుగా మానసిక ఆందోళన ఉంటుంది. వీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు. లేదా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఆందోళన ఉంటూ ప్రతీ విషయంపై దీర్ఘంగా ఆలోచిస్తారు. ఆ తరువాత తీవ్రమైన ఒత్తిడిని కలిగి ఉంటారు. ఆ తరువాత మద్యం లేకుండా ఉండలేమనే బాధతో ఉంటారు. అందువల్ల ఒక్కసారిగా మద్యం మానేయకుండా ఉండాలి. మరి మద్యానికి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ సమస్యకు పరిష్కారం ఎలా? అనే వివరాల్లోకి వెళితే..
మద్యం మానేయాలనుకునేవారు రోజుకు లేదా మద్యం తీసుకున్నప్పుడు కొంత మోతాదును తగ్గిస్తూ ఉండాలి. ఉదాహరణకు ఒకసారి 90 ఎంఎల్ తీసుకుంటే ఆ తరువాత 60 ఎంఎల్ లాగా తీసుకోవాలి. కొన్నాళ్ల పాటు 40 ఎంఎల్ తీసుకోవాలి. ఈ సమయంలో మద్యానికి ప్రత్యామ్నాయంగా ఆహార పదార్థాలను తీసుకోవడం అలవాటు చేసుకుంటే మద్యంపై ఇష్టం ఉండదు. ఇలా మద్యానికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.