House Auction: సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. కానీ తమ కలను నేరవేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంటారు. భూమి కొని ఇల్లు కట్టలేని పరిస్థితుల్లో పాత ఇల్లును కొనుగులు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాత ఇల్ల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఒక్కోసారి పాత ఇళ్లు తక్కువ ధరకు లభిస్తాయి. కొందరు ఇంటి మీదున్న లోన్ ను తీర్చలేకపోయినప్పుడు ఆ ఇల్లును బ్యాంకు వాళ్లు వేలం వేస్తారు. ఈ సమయంలో సాధారణ ధర కంటే తక్కువకే విక్రయిస్తారు. ఇలాంటి సమయంలో ఇల్లు కొనచ్చా? లేదా? అనేది చాలా మందిలో ఉన్న సందేహం. మరి ఆ డౌట్ ను ఇప్పుడే క్లియర్ చేసుకోండి.
కొంత మంది బ్యాంకులోన్ ద్వారా ఇల్లు కట్టుకుంటారు. కానీ వాటిని తీర్చే క్రమంలో పట్టించుకోరు. ఇలా నెల నెలా ఈఎంఐలు కట్టలేని స్థితిలో బ్యాంకు వాళ్లు ఆ ఇల్లును జప్తే చేసుకునే అవకాశం ఉంది. వరుసగా మూడు ఈఎంఐలు కట్టకపోతే 2002 సర్ఫేసీ చట్టం ప్రకారం ఆ ఇల్లును వేలం వేసి లోన్ రికవరీ చేసుకునేందుకు బ్యాంకులకు అవకాశం ఇచ్చింది. అయితే ఇల్లు ను వేలం వేసే సమయంలో ఆస్తిదారుడికి బ్యాంకులు నోటీసులు పంపుతారు. ఇందుకోసం 60 రోజుల గడువు ఇస్తారు. ఆ సమయంలోనూ స్పందించకపోతే ఇల్లును విక్రయిస్తారు.
ముందుగా రూల్స్ ప్రకారం ఇల్లు వేలం వేస్తున్నట్లు ప్రతికా ప్రకటనల ద్వారా తెలియజేస్తారు. ఎవరైనా ఇల్లు కొనుక్కునేందుకు ఈ వేలంలో పాల్గొన వచ్చు. అయితే వేలంలో ఇల్లును కొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వేలం ద్వారా ఇల్లు కొనడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. దీనిని బహిరంగంగానే వేలం వేస్తున్నందున దీనిపై అభ్యంతరం ఉంటే అప్పుడే తెలిసిపోతుంది. అందువల్ల ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు.
అయితే చాలాసారు వేలం ద్వారా కొన్న ఇల్లు ఇంకా తమ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదని వింటూ ఉంటాం. వాస్తవానికి ఇల్లును ప్రాపర్టీల సింబాలిక్ ఆధారంగా వేలం వేస్తారు. అంటే పత్రాల ఆధారంగా ఇల్లును బ్యాంకులు స్వాధీనం చేసుకుంటారు. కానీ కొందరు ఈ వేలానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా సమస్యలమీద కోర్టు వేలానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినట్లయితే వేలంలో ఇల్లు కొన్నవారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇలాంటి ఇల్లు కొనేటప్పుడు బిడ్డింగ్, ఆస్తి టైటిల్ ను పూర్తిగా పరిశీలించాలని న్యాయవాదులు చెబుతున్నారు. దీనిపై మీకు పూర్తిగా అర్థం కాకపోతే దగ్గర్లోని న్యాయ నిపుణులను సంప్రదించాలని అంటున్నారు.