Jagtial: ఎవరూ దిక్కు లేకపోతే.. అక్క మొగుడే దిక్కన్నది నానుడి.. దీనిని ఎందుకు నిజం చేయకూడదనుకుంది ఓ యువతి. కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా, అక్క మొగుడితో జంప్ అయింది. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగింది. విషయం తెలియడంతో పెళ్లి కొడుకుతోపాటు, పెళ్లి కూతురు కుటుంబం సభ్యులు కూడా అవాక్కయ్యారు.
ముహూర్తానికి కొన్ని గంటల ముందు..
ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువయ్యాయి. వావి వరస, చిన్నా పెద్ద మరిచి ఎఫైర్లు నడిపిస్తున్నారు. ఇక పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న వారు కూడా మరొకరిని ఇష్టపడుతున్నారు. జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి మాత్రం అక్క మొగుడితోనే లేచిపోయింది. ఆమెకు మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన ఓ యువకునితో వివాహం కుదిరింది. ఈ మేరకు ఆదివారం పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేశారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అప్పటికే కొంతమంది దగ్గరి బంధువులు పెళ్లి కోసం ఇంటికి వచ్చారు. మరోవైపు పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. అంతా రెడీ అయిందని అనుకుంటున్న తరుణంలో కుటుంబసభ్యులకు వధువు షాకిచ్చింది. ఉదయం 11 గంటలకు కన్నాపూర్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు పెళ్లికూతురు మరో వ్యక్తితో ఉడాయించింది.
అంతా షాక్..
అయితే పెళ్లి కూతురును లేపుకుపోయింది ఎవరో తెలిసి అంతా షాకయ్యారు. తన అక్క మొగుడు వరుసకు బావ అయ్యే వ్యక్తితోనే వధువు పారిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే వధువు పారిపోయిందన్న విషయం తెలియని కుటుంబసభ్యులు ఆమె కోసం వెతకసాగారు. కానీ ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే వరుసకు బావ అయ్యే వ్యక్తితో పెళ్లి కూతురు పారిపోయిందన్న విషయం తెలుసుకున్న వారు ఆందోళన చెందారు. ఇక కాసేపట్లో పెళ్లి మండపానికి రావాల్సిన పెళ్లి కొడుకు విషయం తెలియడంతో ఆ ఊళ్లో కూడా అడుగు పెట్టలేదు. దీంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది.
ముందు నుంచే చనువు..
సాధారణంగా జగిత్యాల జిల్లాలో వివాహేతర సంబంధాలు ఎక్కువ. గొడవలు, పంచాయతీలు, హత్యలు, ఆత్మహత్యలకు ఈ జిల్లాలో ఎక్కువగా వివాహేతర సంబంధాలే కారణం. ఈ క్రమంలో ఓ యువతి తన అక్క మొగుడితోనే లేచిపోయింది. సదరు యువతికి తన అక్క మొగుడితో ముందు నుంచే చనువు ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. అక్కకు తెలియకుండానే సదరు యువతి బావతో రొమాన్స్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లుగా అక్కను చేసుకున్న అతడు మరదలు ఫ్రీగా దొరికిందని ఎంజాయ్ చేశాడు. చిరవకు ఇద్దరూ కలిసి పెళ్లికి కొన్ని గంటల ముందు అందరికీ షాక్ ఇచ్చారు. మరి ఆ ఇద్దరూ తిరిగి వస్తారో.. వస్తే ముగ్గురు కలిసి ఉంటారా.. లేక అక్కకు కూడా సదరు యువతి హ్యాండ్ ఇస్తుందో చూడాలి.