Black Sea Secrets: సముద్రం పేరు చెప్పగానే ఏడు ఉంటాయని చెబుతూ ఉంటారు. వీటిలో అతిపెద్దది పసిఫిక్ మహాసముద్రం కాగా.. అతి చిన్న సముద్రం అంటారు ఆర్కిటిక్ గా పేర్కొంటాం. అయితే వీటిలో నల్ల సముద్రం కూడా ఒకటి ఉందన్న విషయం కొంతమందికే తెలుసు. నల్ల సముద్రం అనగానే ఇక్కడ నీళ్లు నల్లగా ఉంటాయని కాదు. ఈ సముద్రంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అందుకే దీనిని Black Sea అని అంటారు. మధ్య ఆసియా, యూరప్ మధ్యలో ఉన్న ఈ సముద్రం ఏడు దేశాల తీర ప్రాంతాలను కలిగి ఉంది. అయితే దీనిపై ఎంతోమంది సైంటిస్టులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వారు చేసినప్పుడల్లా ప్రతి సందర్భంలో కొత్త విషయం కనుగొంటూ ఉన్నారు. అసలు ఈ సముద్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటి?
Also Read: మీ వ్యాపారంలో తీవ్ర నష్టం వస్తోందా..? అయితే ఇలా చేయండి..
సాధారణంగా ఏదైనా సముద్రంలోకి దిగితే ఏమాత్రం ఆక్సిజన్ లభించదు. దీంతో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా సముద్రంలోకి దిగితే గాలి ఆడక వెంటనే చనిపోతారు. కానీ బ్లాక్ సముద్రం అలా కాదు. ఇందులో 150 మీటర్ల వరకు ఆక్సిజన్ లభిస్తుంది. ఈ సముద్రంలో నీరు మూడు లేయర్లను కలిగి ఉంటుంది. ఇందులో హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి ఉంటాయి. అంటే ఈ సముద్రంలో ఎక్కువగా ఆక్సిజన్ ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో రకరకాల జీవులు నివాసం ఉంటాయి. ముఖ్యంగా చేపలకు ఈ సముద్రం ఎంతో నివాసయోగ్యంగా ఉంటుంది.
అయితే 150 మీటర్ల లోతు తర్వాత నుంచి మెల్లిగా ఆక్సిజన్ మాయమవుతుంది. దీంతో ఇక్కడ ఆక్సిజన్ లభించే అవకాశం ఉండదు. అందువల్ల చేపలు లేదా ఇతర జీవులు కూడా ఈ 150 మీటర్ల దాటి అడుగు భాగానికి వెళ్లలేవు. ఈ ప్రాంతాన్ని ఏలియన్స్ బ్లాక్ సీ అని పేర్కొంటారు.
నల్ల సముద్రంలోని మరొక ప్రత్యేకత ఏంటంటే.. ఈ సముద్రం అడుగు బాగాన ఎన్నో రకాల వస్తువులు ఇప్పటికీ ఉన్నట్లు కొందరు సైంటిస్టులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని మృతదేహాలు సజీవంగా కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ఇవి సజీవంగా ఉండడానికి గల కారణాలు ఉన్నాయి. ఒక వస్తువు లేదా మృతదేహం సజీవంగా ఉండడానికి ఆక్సిజన్ ఉండకూడదు. ఆ విధంగా ఈ సముద్రపు అడుగు బాగాన ఆక్సిజన్ ఉండానందున ఇక్కడ అనేక రకాల మృతదేహాలు.. విలువైన వస్తువులు ఉన్నట్లు చెబుతుంటారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు పరిశోధన చేసిన వారికి పురాతన వస్తువులు లభించాయి.
ఒకప్పుడు గ్రీక్ వంటి దేశాలు ఈ సముద్రాన్ని యుద్ధం కోసం ఉపయోగించుకునేవారు. తమ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఈ సముద్రం పైనే యుద్ధం చేసేవారు. ఈ సముద్రంలో పడినవారు.. ఇందులో మునిగిన షిప్పు ఇప్పటికీ బయటకు రాలేదు.
ఈ నల్ల సముద్రంలో Noyas Ark అనే పడవ దాగి ఉన్నట్టు చెబుతుంటారు. ఈ పడవ విశేషం ఏంటంటే.. భూమిపై పాపాలు పెరిగినప్పుడు దేవుడు తుఫాను, భూకంపం లాంటివి సృష్టిస్తాడు. కానీ ఈ సమయంలో Noyas అనే కుటుంబాన్ని రక్షిస్తాడు. ఈ కుటుంబమే మళ్లీ కొత్త యుగాన్ని ప్రారంభిస్తుంది. ఈ విషయం బైబిల్ తో పాటు హిందూ ధర్మంలోనే ఉంది. హిందూ ధర్మం ప్రకారం భూమి నీళ్లలో మునిగిపోతే విష్ణువు వరాహ అవతారం ఎత్తి భూమిని రక్షిస్తాడు. అయితే ఈ సమయంలో ఒక పడవలో కొందరిని ఉంచి వారితో కొత్త యుగాన్ని ప్రారంభిస్తారు.
Also Read: రూపాయి కన్నా ముందు అసలు ఏం ఉన్నాయి? ఆ నాణేలపై స్పెషల్ స్టోరీ
ఈ బ్లాక్ సి తూర్పు వైపు రష్యా, జార్జియా దేశాలు ఉన్నాయి. పడమర వైపు రొమేనియా, బల్గారియా దేశాలు ఉన్నాయి. ఉత్తరం వైపు ఉక్రెయిన్.. దక్షిణ వైపు టర్కీ దేశాలు ఉన్నాయి. ఈ సముద్రం మధ్యతర సముద్రానికి లింక్ అయి ఉంటుంది.