Putrada Ekadashi 2025: శ్రావణమాసం మొదలవగానే పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ మాసంలో కొన్ని ప్రత్యేక రోజులు వస్తుంటాయి. వీటిలో పుత్రదా ఏకాదశి గురించి చెప్పుకోవాలి. ప్రతి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. 2025 ఆగస్టు 4వ తేదీన పుత్రదా ఏకాదశి వచ్చింది. అలాగే ఈరోజు మహిళలు ఎంతో ఇష్టంగా మంగళ గౌరీ వ్రతాన్ని కూడా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి అదృష్టం వరించనుంది. వారు ఏ పని ప్రారంభించిన విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
Also Read: చరిత్రలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా..?
పుత్రదా ఏకాదశి సందర్భంగా మేషరాశి వారికి విశేష ఫలితాలు లభించనున్నాయి. వీరు ఈరోజు నుంచి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏ పనిని ప్రారంభించినా వెంటనే పూర్తి చేయగలుగుతారు. గతంలో ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరైనా ఇతరులకు డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు చేసేవారు అదనపు ప్రయోజనాలు పొందుతారు.
మిథున రాశి వారికి పుత్రదా ఏకాదశి విజయం తెచ్చి పెట్టనుంది. కొత్తగా ఉద్యోగం లో చేరాలనుకునే వారికి ఇదే మంచి సమయం. అయితే తోటి వారితో సంయమనం పాటించాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఇప్పటికే ఉద్యోగాలు చేసేవారు అదనంగా ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. మీరు చేసే కార్యకలాపాలకు జీవిత భాగస్వామి తోడుగా ఉంటుంది. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారం కోసం కొత్త వ్యక్తులను కలుస్తారు. వీరితో అదనపు ప్రయోజనాలు ఉండనున్నాయి.
ధనస్సు రాశి వారు ఈ ఏకాదశి నుంచి ఏ పని ప్రారంభించిన విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా వీరికి ధన లాభం ఏర్పడుతుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. దీంతో సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కొత్తగా భాగస్వాములు ఏర్పాటు అవుతారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు కాస్త ఆలోచించాలి. వివాహం చేసుకోవాలని అనుకునే వారికి ప్రతిపాదనలు వస్తాయి. కొందరి ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. పిల్లల భవిష్యత్తు కోసం దూర ప్రయాణాలు చేస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. స్నేహితుల మధ్య గొడవలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. ఇతరులకు అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి.
Also Read: డబ్బున్న వాళ్లంతా ‘ఫాంహౌస్’ ఎందుకు కొంటారో తెలుసా?
కుంభ రాశి వారు ఆగస్టు నాలుగవ తేదీ నుంచి సంతోషంగా ఉండగలుగుతారు. పుత్రధా ఏకాదశి వాళ్ళ ఈ రాశి వారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. అనుకోకుండా ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించిన విజయవంతంగా సాగిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరికి అప్పుడే డబ్బు వ్యవహారాలు తెలపకుండా ఉండాలి.