Bengaluru Privacy Violation: చేతిలో ఫోన్ ఉంది.. అపరిమితమైన డాటా ఉంది. ఏదైనా చేయొచ్చు. ఎంతకైనా తెగించవచ్చు. అవసరమైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు.. అంతకుమించి ఇంకా ఏదైనా చేయవచ్చు అనుకుంటే పొరబాటే. ఎందుకంటే నేటి కాలంలో “సోషల్” స్వేచ్ఛ ఎంతైతే ఉందో.. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే బెండు తీసే వ్యవస్థలు కూడా అంతే గొప్పగా ఉన్నాయి. అందువల్లే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఎదుటివారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే తొక్కినార తీస్తారు.. అందుకు ఈ యువకుడి ఊదంతమే ఒక ఉదాహరణ.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో అనుమతి లేకుండా 26 సంవత్సరాల యువకుడు ఓ యువతి వీడియోను తీశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ వీడియో ను చూసిన నెటిజన్లు అడ్డగోలుగా ప్రవర్తించారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. చెప్పడానికి వీల్లేని భాషలో కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయం ఆ యువతి దృష్టికి వచ్చింది. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిదైన స్టైల్ లో మర్యాద చేశారు.
Also Read: భారతదేశానికి India అనే పేరు ఇలా వచ్చింది…
ఎదుటివారి అనుమతి లేకుండా వీడియో తీయడం నేరం. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరింత నేరం. అలాంటి నేరానికి పాల్పడిన వారికి గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. రెండు లక్షల వరకు న్యాయస్థానం జరిమానా విధిస్తుంది. అయితే సదరు యువతి పాశ్చాత్య వస్త్రధారణలో కనిపించింది. దీంతో ఆ యువకుడు ఆమె అనుమతి లేకుండా వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మొత్తం అసభ్య పదజాలంతోనే కూడుకొని ఉన్నాయి. అందువల్లే ఆ యువతి స్పందించింది.
ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేశారు. సదరు యువకుడికి వారిదైన స్టైల్ లో మర్యాద చేశారు. అయితే ఆ యువకుడు విద్యాధికూడని తెలుస్తోంది. చదువుకున్నప్పటికీ అతడు ఇలాంటి పనిచేయడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ యువతకి తెలియకుండా వీడియో తీయడం ఎంతవరకు సమంజసం అని పేర్కొంటున్నారు. చదువుకున్న వ్యక్తికి ఇంగితం ఉండాలని.. అలాంటిదేమీ లేకుండా ప్రవర్తించడం దారుణమని నెటిజన్లు వివరిస్తున్నారు.
Also Read:గంటకు 1000 కి.మీలు.. విమానం కంటే స్పీడు.. ఆ రైలును సృష్టించిన చైనా.. ప్రపంచమే అవాక్కు
బెంగళూరు నగరంలో ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారి పట్ల కఠినంగా ఉంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అత్యంత క్లిష్టమైన కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని చెబుతున్నారు. అనవసరంగా చిక్కుల్లో పడొద్దని.. కోరి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పోలీసులు యువకులకు సూచిస్తున్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడటం వల్ల జీవితం నాశనమవుతుందని పోలీసులు యువతను ఉద్దేశించి హెచ్చరిస్తున్నారు.