Aamir Khan Shilpa Shirodkar Rare Photo: ఈ ఫొటోలో అమీర్ ఖాన్(Aamir Khan) పక్కన ఎంతో హాట్ గా కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?, ఈమె సీనియర్ మోస్ట్ హీరోయిన్, మన టాలీవుడ్ లో ప్రముఖ సూపర్ స్టార్ కి మరదలు అవుతుంది. హిందీ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. గత ఏడాది ఈమె హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని చివరి వారం లో ఎలిమినేట్ అయ్యింది. అంతే కాదు రీసెంట్ గానే ఈమెకు కరోనా కూడా సోకింది. సోషల్ మీడియా మాధ్యమాలలో ఈమె ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది కూడా. ఆమె మరెవరో కాదు శిల్పా శిరోద్కర్(Shilpa Shirodkar). ఈమె మహేష్ బాబు(Superstar Mahesh Babu) సతీమణి నమ్రత శిరోడ్కర్(Namrata Shirodkar) కి సోదరి. 1989 వ సంవత్సరం లో మిథున్ చక్రవర్తి హీరో గా నటించిన ‘భ్రష్టాచార్’ సినిమా ద్వారా ఈమె వెండితెర అరంగేట్రం చేసింది.
ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో శిల్పా కి అవకాశాలు క్యూలు కట్టాయి. ఎంతలా అంటే ఏడాదికి 5 సినిమాలు, ఒక్కోసారి పది సినిమాలు కూడా చేసేంత రేంజ్ లో అన్నమాట. ఒకానొక సమయం లో ఈమెకు డేట్స్ ని సర్దుబాటు చేయడం కూడా చాలా కష్టం అయ్యేది. 2000 సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె, ఆ తర్వాత ఈమె సినిమాలకు పూర్తిగా దూరమైంది. కానీ 2013 వ సంవత్సరం నుండి టెలివిజన్ షోస్ చేస్తూ వచ్చింది. నాలుగు సూపర్ హిట్ టీవీ సీరియల్స్ లో కూడా ప్రధాన పాత్రలు పోషించింది. రీసెంట్ గా ఈమె బిగ్ బాస్ షో ద్వారా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈమె హౌస్ లో ఉన్నప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రొమోషన్స్ కోసం హౌస్ లోపలకు వస్తాడు కూడా.
Also Read: 2 వారాల్లో 2656 కోట్లు.. కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘F1’ చిత్రం!
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకోగా, అవి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఆమె మాట్లాడుతూ ‘ నా పెళ్లి తర్వాత భర్తతో కలిసి న్యూజిల్యాండ్ లో స్థిరపడ్డాను. అక్కడ నేను నా సినిమా వృత్తికి దగ్గరగా ఉన్న హెయిర్ డ్రెస్సింగ్ కోర్స్ ని పూర్తి చేశాను. ఆ తర్వాత హెయిర్ డ్రెస్సర్ గా ఒక సెలూన్ లో రెండు నెలల పాటు ఉద్యోగం కూడా చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో చాలా కాలం వరకు అగ్ర కథానాయికగా కొనసాగిన హీరోయిన్. ఒక సూపర్ స్టార్ కుటుంబానికి చెందిన మనిషి. అయినప్పటికీ కూడా ఎలాంటి ఈగో లేకుండా ఇలాంటి ఉద్యోగాలు చేయడానికి మొగ్గు చూపించడం చూస్తుంటే చాలా గర్వం గా ఉందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.