India : ప్రస్తుతం భారతదేశాన్ని ఇండియా, హిందుస్థాన్ అని పిలుస్తూ ఉంటాం. కానీ మన దేశాన్ని ఒకప్పుడు రకరకాల పేర్లతో పిలిచేవారు. ప్రస్తుతం ఉన్న భారత్ తో పాటు ఇప్పుడు విడిపోయిన ఇతర దేశాలు కలిసి కలిసి ఉండేవి. దీంతో భారత్ ను జంబుద్వీపం, భరతఖండం, హిందుస్థాన్, ఆర్యవర్స్, హిమ దర్శన్ అనే పేర్లు ఉండేవి. అయితే భారతదేశానికి ఇండియా అనే పేరు రావడానికి గల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశానికి ఉత్తరాదిన సింధూ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఈ నది వెంట పట్టణాలు ఉండేవి. అప్పటి జీవనాన్ని తెలుపుతూ సింధు నాగరికత అని అంటారు. ఈ నది పాయలుగా మారి జీలం, చినాబు, బియాస్, రావి, సటిలేజ్, సరస్వతి నదులుగా మారిపోయాయి. ఏడు నదులను కలిపి సప్త సింధు అని పిలుస్తారు. అయితే ఇందులో సరస్వతీ నది అంతరించిపోయింది. దీని గురించి ఋగ్వేదంలో మాత్రమే వివరించబడింది. ప్రస్తుతం ఇది కొన్ని ప్రదేశాల్లో అంతర్వాహీనుగా ప్రవహిస్తుందని చెబుతుంటారు. అయితే ఆ సమయంలో భారత్ ను సప్త సింధు అని పిలిచేవారు.
https://www.instagram.com/reel/DJS6COSpVDU/?utm_source=ig_web_copy_link
ఇండియాకు పర్షియన్లు వచ్చిన విషయం తెలిసిందే. వీళ్లు సింధు అనే పేరు ఉన్న దానిని స అనే అక్షరాన్ని తీసేసి హ చేర్చారు. అంటే సప్త సింధు స్థానంలో hapta hindhu గా మారిపోయింది. కార్యక్రమం లో ఇది హిందుస్థాన్ గా మారిపోయింది. ఇక గ్రీకు భాషలో h ను ఎక్కువగా పలకరు. దీంతో హెచ్ మాయమై ఇండస్ గా మారింది. చివరికి లాటిన్ భాషలో ఇండియాగా మారింది. ఇలా భారతదేశానికి ఇండియా అనే పేరు వచ్చింది. అయితే భారతదేశన్ని భరతుడు అనే రాజు పరిపాలించాడని.. అందుకే భారత్ అని పేరు వచ్చిందని కూడా చెబుతారు.
ఇలా భారత్ కు రెండు పేర్లు అధికారికంగా నమోదయ్యాయి. ఓవైపు భారత్ అని పిలుస్తూ.. మరోవైపు India అని అంటూ ఉంటారు. బ్రిటిష్ పాలనలో ఉన్న భారత్ ఇక్కడి వారి చేతికి రావడంతో స్వతంత్ర జీవనం ప్రారంభమైంది. 1947 ఆగస్టు 15న భారత్ కు స్వాతంత్రం వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో అభివృద్ధిని సాధించుకుంటూ భారత్ ముందుకు వెళ్తుంది. ఆసియాలోనే అతిపెద్ద దేశంగా నెలకొల్పేందుకు వివిధ రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. గతంలో పాకిస్తాన్, కంబోడియా, శ్రీలంక, మయన్మార్ వంటి దేశాలు కలిసి ఉండేవి. కానీ ఇవి విడిపోయిన తర్వాత భారత్ రూపు రేఖలు మారిపోయాయి. ప్రపంచంలోనే అన్ని దేశాల్లో భారతీయులు నివాసం ఏర్పరచుకుంటున్నారు. అలాగే ఇక్కడికి విదేశాల నుంచి వలసలు వస్తున్నారు.