Credit Card Limit: ప్రస్తుత రోజుల్లో చాలామందికి క్రెడిట్ కార్డులు ఒకటికి మించి ఉంటున్నాయి. ఆర్థిక వ్యవహారాలు జరిపేందుకు ఈ క్రెడిట్ కార్డులు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు అందిస్తున్నాయి. అత్యవసర సేవలో, వస్తువుల కొనుగోలు విషయంలో వడ్డీ లేకుండా 40 రోజులపాటు అప్పును ఇస్తుంటాయి. దీంతో చాలామంది క్రెడిట్ కార్డులు తీసుకున్నారు. అయితే క్రెడిట్ కార్డులు తీసుకున్న తర్వాత వాటిని వాడడంలో చాలావరకు తప్పులు చేస్తున్నారు. ఈ తప్పుల వల్ల వడ్డీ భారం అధికంగా ఏర్పడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లించలేక సతమతం అవుతున్నారు. ఇదే సమయంలో క్రెడిట్ కార్డు పై లిమిట్ పెంచుకోవచ్చని ఆఫర్ వస్తూ ఉంటుంది. దీంతో ముందు వెనుక చూడకుండా క్రెడిట్ కార్డ్ లిమిట్స్ పెంచుతూ ఉంటారు. అయితే క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచడం వల్ల ప్రయోజనమేనా? లేక ఏమైనా ఇబ్బందులు ఉంటాయా?
Also Read: 2026 లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న మెగాస్టార్..చరిత్రలో ఇదే తొలిసారి!
క్రెడిట్ కార్డు మొదటిసారిగా తీసుకునేటప్పుడు తక్కువ లిమిట్ తో అందిస్తారు. అయితే ఈ క్రెడిట్ కార్డు వినియోగదారుడు వాడే విధానాన్ని బట్టి లిమిట్స్ పెంచుతూ ఉంటారు. లిమిట్స్ పెంచడం వల్ల చాలా వరకు ప్రయోజనమే. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు చేతిలో ఉన్నట్లే. కానీ దీనిని వాడే తప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ప్రతి బ్యాంకు వినియోగదారుడు క్రెడిట్ కార్డ్ ఎలా వాడుతున్నాడు అనే విషయాన్ని పరిగణిస్తూ ఉంటుంది. ఒక క్రెడిట్ కార్డు లిమిట్ లో 30% వాడితే అతనికి రకరకాల ఆఫర్లు వస్తుంటాయి. రుణాలు, రివార్డులు పొందే అవకాశం ఉంటుంది. 30% అంటే లక్ష రూపాయల లిమిట్ ఉంటే అందులో కేవలం 30 వేల వరకు మాత్రమే వాడుకోవడం. ఇలా 30% వాడడాన్ని క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అని అంటారు. ఇది బాగుంటేనే వినియోగదారుడికి క్రెడిట్ కార్డ్ లిమిట్స్ పెంచే అవకాశం ఉంటుంది.
అయితే ఒక క్రెడిట్ కార్డ్ పై లక్ష రూపాయల లిమిట్ ఉంటే అందులో 30% వాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదే ఒక క్రెడిట్ కార్డ్ పై లిమిట్ రెండు లక్షల వరకు పెంచితే అప్పుడు కూడా ఇంకే మొత్తంలో ఖర్చు పెడితే క్రెడిట్ బ్యూటీలైజేషన్ రేషియో 15% అవుతుంది. అంటే అప్పుడు మరింత ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవైపు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా రావడంతో పాటు మరోవైపు రివార్డ్స్.. ఆఫర్లు వస్తూ ఉంటాయి.
కానీ ప్రతి ఆర్థిక వ్యవహారానికి క్రెడిట్ కార్డు ను యూస్ చేస్తున్నారు. కొందరైతే 80 శాతం వరకు క్రెడిట్ కార్డును వాడుతున్నారు. 80 శాతానికంటే ఎక్కువగా క్రెడిట్ కార్డు వాడితే వారికి లిమిట్ పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరోవైపు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరిగితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తమ చేతిలో డబ్బు ఉందనే ఉద్దేశంతో కొంతమంది రకరకాల వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అందువల్ల క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచితే దానిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు వాడితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.