Megastar Chiranjeevi: 70 ఏళ్ళ వయస్సు లో కూడా కుర్ర హీరోలతో సమానమైన ఎనర్జీ తో సినిమాలు చేస్తూ, ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొడుతున్న ఏకైక ఇండియన్ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఒకరు. ఆయనతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ క్యాటగిరీ లోకి వస్తాడు. సీనియర్ హీరోలలోనే కాదు, స్టార్ హీరోలలో కూడా మెగాస్టార్ చిరంజీవి కి ఉన్నన్ని వంద కోట్ల షేర్ సినిమాలు లేవు. నేటి తరం యూత్ ఆడియన్స్ కి తగ్గ సినిమాలు చేయనప్పటికీ కూడా ఆయన ఈ రేంజ్ ట్రాక్ రికార్డు ని మైంటైన్ చేయడం సాధారణమైన విషయం కాదు. అయితే చిరంజీవి గత చిత్రం ‘భోళా శంకర్’ కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత ఆయన నుండి ‘విశ్వంభర’ అనే చిత్రం విడుదల అవుతుందని అనుకున్నారు.
కానీ దానికి బదులుగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం విడుదల కాబోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న ఈ చిత్రం మన ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో, ట్రేడ్ లో అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. ఇందులో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమా తో పాటు వచ్చే ఏడాది చిరంజీవి నుండి మరో రెండు సినిమాలు కూడా మన ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి విశ్వంభర. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని చాలా రోజులైన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే నెలలో విడుదల చేయించే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన తనతో ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన బాబీ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.
రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నెల నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఇలా అన్ని కుదిరితే వచ్చే ఏడాది మెగాస్టార్ చిరంజీవి నుండి మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చిరంజీవి, బాబీ సినిమా 2027 సంక్రాంతికి కూడా షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఓజీ చిత్రం వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెగా ఫ్యామిలీ ని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది.