Bigg Boss 9 Telugu Bharani Nominates Tanuja: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో జరిగిన ఎలిమినేషన్స్ లో ఆడియన్స్ ని బాగా ఎమోషనల్ కి గురి చేసిన ఎలిమినేషన్ ఏదైనా ఉందా అంటే అది భరణి ఎలిమినేషన్ మాత్రమే. ఎలిమినేట్ అయిన రోజు ఆయన ప్రవర్తించిన తీరు, అదే విధంగా ఆయన్ని అమితంగా ఇష్టపడే తనూజ, దివ్య వంటి వారు వెక్కిళ్లు పెట్టి ఏడవడం, ఇమ్మానుయేల్ భరణి కి వెన్నుపోటు పొడవడం, ఇలా ఎన్నో ఎమోషన్స్ మధ్య ఆయన ఎలిమినేషన్ జరిగింది. భరణి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని చాలా మంది కోరుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు. ఒక మంచి మనిషి ఎలిమినేట్ అయ్యాడే అని బాధ పడ్డారు. అయితే నిన్న రాత్రి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వారిలో భరణి కూడా ఉన్నాడు.
Also Read: 2026 లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న మెగాస్టార్..చరిత్రలో ఇదే తొలిసారి!
భరణి రీ ఎంట్రీ ఇస్తే మళ్లీ బంధాలు అంటూ తనూజ, దివ్యాలతో తండ్రీకూతుళ్ళ రిలేషన్ ని కొనసాగిస్తాడా?, లేదంటే ఈసారి గేమ్ మీద ఫోకస్ పెట్టి హౌస్ మేట్స్ అందరినీ దడలాడిస్తాడా అనే అంశంపై ఆసక్తిగా ఎదురు చూసారు ఆడియన్స్. కచ్చితంగా ఆయన గేమ్ మీదనే ఫోకస్ పెట్టి ఆడాలని అంతా కోరుకున్నారు. వాళ్ళ కోరిక కు తగ్గట్టే ఈసారి భరణి ఫైర్ మీద హౌస్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన తనూజ ని నామినేట్ చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది అట. వీళ్లిద్దరి మధ్య హౌస్ లో పెద్ద యుద్ధమే నడిచిందని సమాచారం. తనూజ కూడా నాన్న అని పిలవడం మానేసి భరణి గారు అని పిలవడం మొదలు పెట్టిందట. ఇది వీళ్లిద్దరి రిలేషన్ ని ఇష్టపడే ఆడియన్స్ కి కాస్త బాధని కలిగించి ఉండొచ్చు కానీ, గేమ్ పరంగా చూసే ఆడియన్స్ కి మాత్రం ఇది కదా అసలు సిసలు గేమ్ అంటే అని అనుకోక తప్పదు.
అయితే భరణి ఏ కారణం చేత నామినేట్ చేసాడు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. సరైన పాయింట్స్ తో నామినేట్ చేసుంటే మాత్రం భరణి గ్రాఫ్ ఎవ్వరూ ఊహించనంత ఎత్తుకి చేరుతుంది. ఒకవేళ సరైన పాయింట్స్ లేకపోతే మాత్రం తనూజ కి మరింత సానుభూతి పెరిగి ఆమె గ్రాఫ్ ఊహలకు అందనంత రేంజ్ కి చేరుతుంది. భరణి తనూజ పట్ల ఇప్పటి వరకు చాలా నిజాయితీ గానే ఉన్నాడు. కానీ తనూజ మాత్రం ఆయన గురించి వెనుక చేరి చాలా మాటలు మాట్లాడింది. ఇవన్నీ బయటకు వెళ్లి చూసిన తర్వాత భరణి తనూజ ని నామినేట్ చేశాడా?, లేదా వేరే ఏదైనా కారణం తో చేశాడా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.