Norwegian Prison: ఎవరైనా తప్పు చేసేటప్పుడు ఎవరు ఆలోచించరు.. కానీ ఆ తర్వాత శిక్ష పడి జైలుకు వెళ్లాలంటే మాత్రం భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే జైలుకు వెళ్లడం అంటే దాదాపు నరకంలోకి వెళ్లినట్లే. జైలు జీవితం అంటే ఎలాంటి స్వేచ్ఛ ఉండదు.. కావలసిన సౌకర్యాలు ఉండవు.. ప్రతిరోజు తప్పనిసరిగా చెప్పిన పనిని చేయాల్సి ఉంటుంది.. నేరాన్ని బట్టి శిక్ష అధికంగా ఉండవచ్చు.. కానీ ఒక జైలులో మన ఇంట్లో ఉన్న వాతావరణం ఉంటే ఎంత బాగుంటుంది. ప్రత్యేకంగా గదిని కేటాయించి లగ్జరీ జీవితాన్ని ఇస్తే ఎలా ఉంటుంది. కానీ అలాంటి సౌకర్యాలు ఎవరైనా ఇస్తారా? తప్పకుండా ఇస్తున్నారు. ఇంట్లో కంటే జైలు జీవితమే బాగుంటుంది.. అన్న విధంగా చేస్తున్నారు. ఇంతకీ ఇలాంటి సౌకర్యాలు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు?
Also Read: 2026 లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న మెగాస్టార్..చరిత్రలో ఇదే తొలిసారి!
సాధారణంగా ఒక జైలులో చీకటి గది ఉంటుంది. లేదా ఇద్దరు, ముగ్గురితో కూడిన గది అయినా ఉంటుంది. ఆ గది ఇరుకు గా ఉండడంతో పాటు.. ఎలాంటి గాలి సౌకర్యం లేకుండా.. ఇతరులతో ఏమి మాట్లాడకుండా నరకంలా ఉంటుంది. కానీ నార్వే దేశంలోని Halden ప్రాంతంలో ఉన్న ఈ జైలు ప్రపంచంలోనే ప్రత్యేకతను కలిగి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ జైలుకు వెళ్లాలని కొందరు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ జైలులో ఖైదీలకు సకల సౌకర్యాలను అందిస్తున్నారు. ఒక ఖైదీకి ప్రత్యేక లగ్జరీ గదిని కేటాయిస్తారు. ఉదయం లేవగానే వ్యాయామం చేయడానికి ప్రత్యేకంగా పరికరాలు ఇస్తారు. సముద్రం పక్కన వాకింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. కావలసిన ఆహారాన్ని అందిస్తారు. ఒకవేళ జైలులో అందించే ఆహారం నచ్చకపోతే సొంతంగా వంట చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు. జైలులో మిగతా వారితో కలిసి వ్యాయామం చేయవచ్చు. వారితో సరదాగా గడపవచ్చు.
ఈ జైలులో ఉన్నవారు కొన్ని రోజుల తర్వాత ఒక యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినట్లు ఉంటుంది. ఎందుకంటే ఈ జైలులో ఉన్నన్ని రోజులు ఖైదీలు ఏదో ఒక రంగంలో నిష్ణానుతులుగా మారుతారు. వారికి నచ్చిన రంగంలో సరైన శిక్షలను అందిస్తారు. ఆ శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఇక్కడే ఉద్యోగం చేయడానికి కూడా అవకాశం ఇస్తారు. గ్రాఫిక్ డిజైనర్ కూడా ఇక్కడ విధులు నిర్వహించడానికి అవకాశం ఇస్తారు. ఇలా మొత్తంగా ఖైదీలను ఒక కుటుంబ సభ్యుల భలే చూసుకుంటూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక ఖైదీ పై ఇక్కడి ప్రభుత్వం రూ. 80 లక్షల వరకు ఖర్చు చేస్తుందంటే ఎవరు నమ్మరు.
అయితే ఇలా చేయడానికి కారణం ఏంటన్న సందేహం చాలామందికి వచ్చింది. ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇలా అవకాశం ఇస్తారు. అంతేకాకుండా జైలు జీవితం అంటే ఒక నరకం కాదని.. తమ జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం అని తెలపడానికే ఇలాంటి సౌకర్యాలను అందిస్తున్నారు. అయితే దీనిపై చాలా విమర్శలు ఉన్నాయి. కొందరు ఖైదీలకు ఇలాంటి సౌకర్యాలు ఇస్తే వారు మరోసారి తప్పు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా జైలులో ఇలా సౌకర్యాలు ఉండడం వల్ల కొందరిలో ప్రవర్తన మారదు అని చెబుతున్నారు. కానీ ఇక్కడి ప్రభుత్వం మాత్రం ఎవరి మాట వినకుండా ఖైదీలకు సకర సౌకర్యాలు ఇస్తున్నారు.