Atal Pension Scheme: కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయస్సులోపు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు 60 సంవత్సరాల వరకు ఈ స్కీమ్ కు సంబంధించిన డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి నెలా డబ్బులను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్‌డీఏ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్ లో ఏకంగా 65 లక్షల మంది చేరారని సమాచారం. సబ్‌స్క్రైబర్ మరణిస్తే భాగస్వామి పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. భార్యాభర్తలిద్దరూ ఈ స్కీమ్ లో ఇద్దరికీ కలిపి నెలకు 700 రూపాయల చొప్పున చెల్లిసే పదవీ విరమణ తర్వాత నెలకు 10,000 రూపాయలు పొందవచ్చు.
రోజుకు కేవలం 22 రూపాయలు పొదుపు చేయడం ద్వారా సులభంగా ఈ మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ లేదా బ్యాంకును సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.