AP employees: ఏపీలో ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించిన వ్యవహారం ఎంతలా హాట్ టాపిక్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందుకు సంబంధించిన ఉద్యోగులు ఇప్పటికే అనేక నిరసనలు కూడా తెలిపారు. అయితే వీరితో చర్చల అనంతరం వేతన సవరణ మీద ప్రభుత్వం కూడా ఓ నిర్ణయానికి వచ్చింది. ఇకపోతే ఇప్పుడు మరోసారి ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. ఉద్యోగుల జీతాల సవరణ జీవోలను వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
జగన్ సర్కార్ చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అని, తమను మోసం చేశారంటూ మండిపడుతున్నారు. సీఎస్ సమీర్ శర్మను కలిసి తమ గోడును వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోల మీద తీవ్ర అసంతృప్తిని తెలిపారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి, త్వరలోనే తమ కార్యాచరణను వెల్లడిస్తామంటూ స్పష్టం చేశారు. కాగా ప్రభుత్వం జీవోలలో హెచ్ఆర్ఏలో భారీగా కోతలు విధించింది. 30 శాతం ఉన్నటువంటి హెచ్ఆర్ఏను 16 శాతం వరకు తగ్గించడాన్ని అందరూ నిరసిస్తున్నారు.
Also Read: గ్యాస్ సిలిండర్ పేలితే సులువుగా పరిహారం పొందే ఛాన్స్.. ఎలా అంటే?
దీంతో ఈ జీవోల మీద ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచుతామని చెప్పి తగ్గించడం ఏంటంటూ మండిపడుతున్నారు. ఏపీ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు ఈ జీవో మీద తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. తమకు నష్టం చేకూర్చే జీవోలు వద్దని, తాము చర్చించిన దానికి భిన్నమైన జీవోలు ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నించారు.
తమతో చర్చించిన విషయాలను కాకుండా ఇతర విషయాలను ఉటంకిస్తూ జీవోలు ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు చాలామంది. జగన్ సర్కార్ ఉద్దేశ పూర్వకంగా ఇలా చేయడం ఏంటంటూ మండిపడుతున్నారు. సమావేశంలో మాట్లాడిన వాటిని పక్కన పెట్టడం ఏంటంటూ అడిగారు. ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ తాము ప్రతి రోజూ నల్ల బ్యాడ్జీలను ధరించి ఆఫీసులకు హాజరవుతామంటూ స్పష్టం చేశారు. ఇక ఈ వ్యవహారం మీద ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: చంద్రబాబుపై జగన్ కు ఎంత ప్రేమో బయటపడింది!