Atal Pension Scheme: కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయస్సులోపు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు 60 సంవత్సరాల వరకు ఈ స్కీమ్ కు సంబంధించిన డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి నెలా డబ్బులను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
బ్యాంక్ లేదా పోస్టాఫీస్ కు వెళ్లడం ద్వారా ఈ స్కీమ్ లో సులభంగా చేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి నెలా చెల్లించే మొత్తంను బట్టి ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. నెలకు 210 రూపాయల చొప్పున చెల్లిస్తే 5,000 రూపాయల చొప్పున 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ ను పొందవచ్చు. వయస్సు పెరిగే కొద్దీ చెల్లించే మొత్తం పెరుగుతుంది కాబట్టి చిన్న వయస్సులోనే ఈ స్కీమ్ లో చేరితే మంచిదని చెప్పవచ్చు.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పీఎఫ్ఆర్డీఏ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్ లో ఏకంగా 65 లక్షల మంది చేరారని సమాచారం. సబ్స్క్రైబర్ మరణిస్తే భాగస్వామి పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. భార్యాభర్తలిద్దరూ ఈ స్కీమ్ లో ఇద్దరికీ కలిపి నెలకు 700 రూపాయల చొప్పున చెల్లిసే పదవీ విరమణ తర్వాత నెలకు 10,000 రూపాయలు పొందవచ్చు.
రోజుకు కేవలం 22 రూపాయలు పొదుపు చేయడం ద్వారా సులభంగా ఈ మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ లేదా బ్యాంకును సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Atal pension yojana scheme benefits details here
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com