Old-phone
Be Careful: ఆదాయం అందరికీ ఒకే విధంగా ఉండదు. కొందరికి కొన్ని వృత్తుల కారణంగా ఎక్కువ ఆదాయం వస్తుంది. మరికొందరు తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తారు. ఈ క్రమంలో తక్కువ ఆదాయం ఉన్నవారు కొన్ని తక్కువ ధరకు ఉండే వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఈ వస్తువులు ఒక్కోసారి సెకండ్ హ్యాండ్ కూడా ఉంటాయి. ఒకప్పుడు ప్రజల చేతుల ఆదాయం తక్కువగా ఉండి.. రుణం తీసుకునేందుకు మార్గం లేకపోవడంతో ఉన్న దాంట్లోనే పాత వస్తువులను కొనుగోలు చేసేవారు. వీటిలో వాహనాలు, మొబైల్స్ ఉండేవి. అయితే ఇప్పుడు కూడా కొందరు సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. పాత ఫోన్ లను కొనుగోలు చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాటిలో తాజాగా జరిగిన సంఘటన గురించి తెలిస్తే షాక్ అవుతారు. అయితే పాత ఫోన్లు కొంటే ఏం జరుగుతుందో తెలుసా?
చాలామంది ఒకసారి కొనుగోలు చేసిన మొబైల్ ను తిరిగి వాటిని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మార్కెట్లోకి కొత్తగా వచ్చే మోడల్స్ లేదా తమ మొబైల్ తమకు అనుకూలంగా అప్డేట్ తో లేకపోవడంతో కొత్త మొబైల్ కొని పాత మొబైల్ ను విక్రయిస్తుంటారు. కొందరు ఇలా మొబైల్ ను కొనుగోలు చేసి వాటిని తిరిగి వేరే వారికి విక్రయిస్తారు. అయితే ముందుగా కొనుగోలు చేసిన మొబైల్ లో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి తిరిగి విక్రయిస్తారు. ఇలా విక్రయించిన వాటిలో బ్యాటరీ పనిచేయకపోతే కొత్త బ్యాటరీ అమరుస్తారు. అయితే సాధారణంగా ఒక ఫోన్ కొనుగోలు చేసినప్పుడు మాత్రమే ఒరిజినల్ బ్యాటరీ వస్తుంది. రెండోసారి బ్యాటరీ వేసుకోవాలంటే నాణ్యత లేనిదే ఉంటుంది. ఇలా నాణ్యతలేని బ్యాటరీలను సెకండ్ హ్యాండ్ ఫోన్లలో అమరుస్తున్నారు. అలా అమర్చడం వల్ల ఏం జరిగిందంటే?
ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ఘడ్ జిల్లాలో ఓ వ్యక్తి పాత మొబైల్ ని కొనుగోలు చేశాడు. దానిని చార్జింగ్ కోసం పెట్టగానే అది పేలిపోయింది. దానిని పరిశీలించగా అందులో చైనా బ్యాటరీ ఉన్నట్లు గమనించాడు. అంటే తనకు విక్రయించిన వ్యక్తి అందులో చైనా బ్యాటరీని అమర్చి ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవానికి అది ఒక బ్రాండెడ్ ఫోన్. కానీ అందులో చైనాకు చెందిన బ్యాటరీని అమర్చారు. ఇలా అమర్చి దానిని ఎక్కువ రేటుకు విక్రయించారు. ఓవైపు ఎక్కువ ధర చెల్లించి మోసపోయిన ఆ వ్యక్తి ఇప్పుడు ఆ ఫోన్ పేలడంతో షాక్కు గురయ్యాడు.
పాత మొబైల్స్ కొంటే ఇలాంటి సంఘటనలే ఎదురవుతాయని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల పాత ఫోన్లను ఎట్టి పరిస్థితిలో కొనుగోలు చేయవద్దని తెలుపుతున్నారు. అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ ఫోను కొనుగోలు చేస్తే ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టి ఉండకూడదని పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల అందులోకి అధిక విద్యుత్తు వెళ్లి బ్యాటరీ పేలిపోయే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణ ఫోన్లో మాత్రమే కాకుండా బ్రాండెడ్ ఫోన్లో సైతం ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టి ఉండకూడదని పేర్కొంటున్నారు. అందువల్ల ఇకనైనా పాత ఫోన్లో విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.