https://oktelugu.com/

Weight Loss: ప్రతిరోజు ఇది తాగితే కొవ్వు కొవ్వొత్తిలా కరుగుతుంది..

వేసవి దాదాపు ఎంట్రీ ఇచ్చినట్టే. ఎండలు 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి. ఏప్రిల్ రాకముందే బయటకు వెళ్లాలంటే చాలా కష్టంగా మారింది. వాతావరణంలో మార్పులు కూడా చోటు చేసుకోవడంతో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు.

Written By: , Updated On : March 19, 2025 / 05:05 PM IST
Weight Loss Tips

Weight Loss Tips

Follow us on

Weight Loss: వేసవి దాదాపు ఎంట్రీ ఇచ్చినట్టే. ఎండలు 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి. ఏప్రిల్ రాకముందే బయటకు వెళ్లాలంటే చాలా కష్టంగా మారింది. వాతావరణంలో మార్పులు కూడా చోటు చేసుకోవడంతో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఎండ వేడి నుంచి తట్టుకోవడానికి చల్లదనాన్ని ఇచ్చే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వాతావరణానికి తట్టుకోవచ్చు. చల్లదనాన్ని ఇచ్చే వస్తువుల్లో నాచురల్ గా ఉండేవి చూసుకోవాలి. కూల్ డ్రింక్స్ మద్యం జోలికి పోకుండా సాంప్రదాయ ఆహార పదార్థాలు వంటివి తీసుకోవాలి. వీటిలో మజ్జిగ తప్పనిసరిగా ఉండాలి. అసలు మజ్జిగలో ఎలాంటి పోషకాలు ఉంటాయి. ఎండాకాలంలో ఇది చేసే మేలు ఏంటి?

చాలామంది మజ్జిగ అనగానే దూరం పెడుతుంటారు. ఎందుకంటే కొంతమందికి దీనిని తీసుకోవడం ఇష్టం ఉండదు. దీనికి బదులు కూల్ డ్రింక్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ కూల్ డ్రిస్ కంటే మజ్జిగ చేసే మేలే ఎక్కువగా ఉంటుంది. వేసవికాలంలో మజ్జిగ తీసుకోవడం వల్ల పొట్ట కరిగి లావు తగ్గుతారు. 100 మిల్లి లీటర్ల మజ్జిగలో దాదాపు 40 కేలరీల శక్తి వస్తుంది. అయితే ఇది పాలలో ఉండే కొవ్వు కంటే తక్కువగా కేలరీలను అందిస్తుంది. ఇందులో ప్రోటీన్లతో పాటు కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే బాస్వరం ఎక్కువగా ఉంటుంది.

మజ్జిగలో రివో ఫ్లేవిన్ ఉండడంవల్ల ఇది శరీరాన్ని యాక్టివ్గా చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో బి 12 విటమిన్ లభిస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వారికి మజ్జిగ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం కంటే మజ్జిగ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఉత్సాహంతో పాటు కేలరీలు తక్కువగా తీసుకున్నవారు అవుతారు. దీంతో ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉచ్చడంతో పాటు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

మజ్జిగలో ప్రో బయోటిక్స్ అనే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటాయి. అయితే మజ్జిగలో మెంతి గింజల పొడిని తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉండే అనవసరపు మైన కొవ్వు తగ్గుతూ ఉంటుంది. మజ్జిగ తాగడం వల్ల కడుపు నిండినట్లుగా ఉండి తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. దీంతో బరువు పెరిగే ఆస్కారం ఉండదు. అయితే ఉన్న కేలరీలను కరిగించడానికి కూడా మజ్జిగ ఉపయోగపడుతుంది.

ఇక వేసవికాలంలో మజ్జిగ ఎంతో మేలును చేస్తుంది. ఎండలో బయటకు వెళ్లాలని అనుకునేవారు మజ్జిగ తాగి బయటకు వెళ్లడం వల్ల వడదెబ్బ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎండలో ఎక్కువసేపు ఉండి ఇంట్లోకి వచ్చిన తర్వాత సాధారణ నీరు కాకుండా మజ్జిగ తీసుకోవడం వల్ల కూడా ఉపయోగకరంగా ఉంటుంది.అయితే మజ్జిగలో జీలకర్ర లేదా ఇతర పదార్థాలను వేసుకోవడం వల్ల రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఎక్కువ శాతం నీటిని ఉండేలా చూసుకోవాలి. మజ్జిగ బయట దొరికేది కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల ఎంతో మేలు. నాచురల్ పెరుగుతో మజ్జిగ చేసుకోవడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల వేసవికాలంలో మజ్జిగ తీసుకోవడం కచ్చితంగా అలవాటు చేసుకోండి.