https://oktelugu.com/

ఇళ్లు, భూమి కొనుగోలు చేస్తున్నారా.. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలివే?

మనలో చాలామంది భవిష్యత్తులో ఎక్కువ మొత్తం ఆదాయం సంపాదించాలనే ఆలోచనతో ఇళ్లు, భూములపై పెట్టుబడులు పెడుతుంటారు. గత కొన్నేళ్లలో ఇళ్లు, భూముల ధరలు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. అయితే 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసి ఇళ్లు, భూములు కొనుగోలు చేస్తే మాత్రం టీడీఎస్ ను మినహాయించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం విక్రయాల మొత్తంలో ఒక శాతం టీడీఎస్ గా ఉంది. ఆదాయపు పన్ను శాఖకు టీడీఎస్ రూపంలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 7, 2021 / 02:55 PM IST
    Follow us on

    మనలో చాలామంది భవిష్యత్తులో ఎక్కువ మొత్తం ఆదాయం సంపాదించాలనే ఆలోచనతో ఇళ్లు, భూములపై పెట్టుబడులు పెడుతుంటారు. గత కొన్నేళ్లలో ఇళ్లు, భూముల ధరలు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. అయితే 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసి ఇళ్లు, భూములు కొనుగోలు చేస్తే మాత్రం టీడీఎస్ ను మినహాయించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం విక్రయాల మొత్తంలో ఒక శాతం టీడీఎస్ గా ఉంది.

    ఆదాయపు పన్ను శాఖకు టీడీఎస్ రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని డిపాజిట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి ఆ సూచనలను పాటించడం ద్వారా టీడీఎస్ కు సంబంధించిన నియమాల ప్రకారం డబ్బులు డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    ఇ ట్యాక్స్ ఎంపిక ద్వారా ఆన్ లైన్ లో టీడీఎస్ ను చెల్లించడంతో పాటు నెట్ బ్యాంకింగ్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి పన్ను చెల్లింపులు చేయవచ్చు. https://www.tin-nsdl.com/ వెబ్ సైట్ ద్వారా సర్వీసెస్ ట్యాబ్ పై క్లిక్ చేసి ఆస్తి అమ్మకంపై టీడీఎస్ ను చూసి టీడీఎస్ కు సంబంధించిన ఫారంపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. 26qb ఫారంను నింపడం ద్వారా ఆస్తి అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన సమాచారాన్ని అందించవచ్చు.

    టీడీఎస్ తీసివేయబడిన తర్వాత రోజు నుంచి 7 రోజులలో ఫారమ్ 26qb ను ఫైల్ చేయని పక్షంలో కొనుగోలుదారు కొంత మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాలి. ఆన్ లైన్ ఫారమ్ లో ఏవైనా తప్పులు ఉంటే దిద్దుబాటు కొరకు ఆన్ లైన్ లో అభ్యర్థనను పంపాల్సి ఉంటుందని సమాచారం.