మీరు వాడే వంట నూనెల్లో ఏది మంచిది.. గుర్తుంచుకోవాల్సిన విషయాలివే?

ఇంట్లో వంటలు చేయడానికి అవసరమైన వాటిలో వంటనూనె ఒకటనే సంగతి తెలిసిందే. పండుగ సమయంలో వంటకాలు చేయడానికి ఏదో ఒక వంటనూనెను వాడతారు. వంటనూనె రకాన్ని బట్టి, బ్రాండ్ ను బట్టి వంటనూనె ధరలలో మార్పులు ఉంటాయి. అయితే వేర్వేరు రకాల వంటనూనెలు అందుబాటులో ఉండటంతో ఏ వంటనూనె మంచిదనే ప్రశ్నకు చాలామందికి సమాధానం దొరకడం లేదు. వంటనూనెలో కొవ్వు శాతం అధికంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. వంటనూనెలో పోలిఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలతో పాటు అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్‌, […]

Written By: Navya, Updated On : November 7, 2021 2:50 pm
Follow us on

ఇంట్లో వంటలు చేయడానికి అవసరమైన వాటిలో వంటనూనె ఒకటనే సంగతి తెలిసిందే. పండుగ సమయంలో వంటకాలు చేయడానికి ఏదో ఒక వంటనూనెను వాడతారు. వంటనూనె రకాన్ని బట్టి, బ్రాండ్ ను బట్టి వంటనూనె ధరలలో మార్పులు ఉంటాయి. అయితే వేర్వేరు రకాల వంటనూనెలు అందుబాటులో ఉండటంతో ఏ వంటనూనె మంచిదనే ప్రశ్నకు చాలామందికి సమాధానం దొరకడం లేదు.

వంటనూనెలో కొవ్వు శాతం అధికంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. వంటనూనెలో పోలిఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలతో పాటు అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్‌, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. నూనెలో ఉండే కొవ్వును మన శరీరం సులువుగా జీర్ణించుకోలేదు. నూనెలో ఉండే కొవ్వుశాతం శరీరంలో పేరుకుపోతే రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండే ఆయిల్ ను వాడాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

ఇతర ఆయిల్స్ తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ ను వాడటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఐదు శాతం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. మధ్యధరా ప్రాంతాలలో ఆలివ్ చెట్లు ఎక్కువగా ఉండగా ఆలివ్ గుజ్జు నుంచి ఆలివ్ ఆయిల్ ను తీసే అవకాశం ఉంటుంది. సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ఆరోగ్యానికి మంచివే అయినా ఆలివ్ ఆయిల్ ఇతర ఆయిల్స్ తో పోలిస్తే బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.

పామాయిల్ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. పామాయిల్ గుండె జబ్బుల రిస్క్ ను పెంచే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మళ్లీ మళ్లీ వేడి చేసిన నూనె ఆరోగ్యానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.