https://oktelugu.com/

ఏపీలోని ప్రముఖ సంస్థలో నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలు.. అర్హులెవరంటే?

ఏపీలోని నిరుద్యోగులకు కర్నూలులో ఉన్న ఇండియణ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యూఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం) శుభవార్త చెప్పింది. ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థ నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా మొత్తం 8 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ రిజిస్టార్, జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండంట్‌, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్‌ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 7, 2021 3:00 pm
    Follow us on

    ఏపీలోని నిరుద్యోగులకు కర్నూలులో ఉన్న ఇండియణ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యూఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం) శుభవార్త చెప్పింది. ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థ నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా మొత్తం 8 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    అసిస్టెంట్ రిజిస్టార్, జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండంట్‌, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్‌ టెక్నీషియన్‌, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, పీజీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనుభవం, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    27 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు.ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. నవంబర్ 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

    ఈ ఏడాది డిసెంబర్ 2వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలను దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://iiitk.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.