Soul: అన్ని దేశాలు, ప్రాంతాల్లో కూడా దయ్యాల ప్రస్తావన వస్తూనే ఉంటుంది. కోరికలు తీరకుండా చనిపోయిన వ్యక్తుల ఆత్మలు దెయ్యాలు, ప్రేతాత్మలు గా మారతాయి అని, భూతాల రూపంలో తిరుగుతాయి అని చాలా సినిమాల్లో చూశాము. ఇవి రాత్రి పూట ఎడారులు, శ్మశాన వాటికలు, ఊర్లలో కూడా తిరుగుతాయి అంటారు. అయితే దయ్యాలు ఉన్నాయని తెలిపే కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎవరైనా మిమ్మల్ని అనుసరిస్తున్నట్టు, మిమ్మల్ని ఎవరైనా తాకినట్టు అనిపించి మీరు వెనక్కు తిరిగి చూస్తే ఎవరు లేకపోతే కాస్త జాగ్రత్తగా ఉండండి. బహుశా ఒక ఆత్మ మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటుందట. ఇంట్లో పెంపుడు జంతువు భయపడినట్టు లేదా ఒక నిర్దిష్ట దిశలో చూసి మొరగడం లేదా కేకలు వేస్తే దానిని విస్మరించకండి అంటారు నిపుణులు. ప్రశ్నించే దయ్యాలు కూడా ఉంటాయట. జంతువులు దయ్యాల ఉనికిని గుర్తింస్తాయట. మీరు ఒకవేళ ఆకస్మికంగా నీడను చూస్తే ఆ తర్వాత మీకు ఏం కనిపించకపోతే కూడా జాగ్రత్త.
మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతుంటే మీ ఇంట్లో ఆత్మ ఉందని అనుమాన పడండి. ఇంట్లో ఏదైనా కనిపించకుండా పోయి ఆ తర్వాత మళ్లీ దొరికితే అప్రమత్తంగా ఉండండి. ఇదే తరచుగా జరుగుతుంటే కూడా జాగ్రత్త. తప్పిపోయిన వస్తువు ఆ ఆత్మకు ఇష్టం ఉన్న వస్తువు కావచ్చట. కొన్ని సార్లు ఒక వ్యక్తి పెర్ఫ్యూమ్ ఉపయోగించకపోయినా అతని వద్దకు వెళ్లకపోయినా కూడా నార్మల్ గా పెర్ఫ్యూమ్ వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు ఆత్మ మీ దగ్గర నుంచి వెళ్తుందని అనుకోండి. తరచూ ఆత్మ కళ్లు మీకు దగ్గరలో ఉంటే ఒక సువాసన వస్తుందట.
ఇంట్లో గడియారం పదే పదే నిర్ణీత సమయంలో ఆగిపోతుంటే దయ్యం ఉందనే సంకేతమట. ఇంటి కిటికీ తలుపులు పదే పదే కొట్టుకున్న గాలిలో చిక్కుకున్నట్టు అనిపించినా ఆత్మ ఉందని అనుమానించాలట. అలాంటప్పుడు ఓ ఆత్మ మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నట్టు తెలుసుకోండి. కొన్ని సార్లు వింత శబ్దాలు వినిపించడం, ఏదో పడిపోయినట్టు లేదా అడుగుల చప్పుడు శవం స్వరం వినిపించడం వంటివి జరుగుతుంటే మీ వద్ద ఆత్మ ఉన్నట్టు తెలుసుకోండి అంటారు నిపుణులు.
ఈ విషయాలు అన్నీ కూడా కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ లోని సమాచారం, ప్రజల విశ్వాసం కోసం మాత్రమే మీకు అందిస్తున్నాము. వీటిని ఒకే తెలుగు నిర్దారించదు.