Beard : నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ స్టైల్ నుంచి ‘కబీర్ సింగ్’ చిత్రంలోని షాహిద్ కపూర్, ‘యానిమల్’ చిత్రంలోని రణబీర్ కపూర్ వరకు చాలా మంది నటీనటుల మందపాటి గడ్డం లుక్ ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు. ఇక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గడ్డం స్టైల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వెండితెరపైనే కాదు, అబ్బాయిలకు వారి దైనందిన జీవితంలో కూడా స్టైలిష్ గడ్డం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది సూపర్ లుక్ ను అందిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా మందపాటి, స్టైలిష్ గడ్డం ట్రెండ్‌లో ఉంది. అయితే ఈ గడ్డం జస్ట్ లుక్ ను మాత్రమే కాదు ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
గడ్డం పెంచడం వల్ల అతినీల లోహిత కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. చర్మం కందిపోకుండా కాపాడుకోవచ్చు. గడ్డం లేని వారితో పోలిస్తే గడ్డం ఉన్న వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు నిపుణులు. గాలిలో ఉండే దుమ్మూ, ధూళి కణాలు ముక్కులోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది ఈ గడ్డం. గడ్డం ఉన్న చోట చర్మం నుంచి సహజసిద్ధమైన నూనెల ఉత్పత్తి కూడా తేమగానే ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ గడ్డం పెంచడం మాత్రం చాలా కష్టం. కానీ దీనికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయండోయ్. మీరు గడ్డం రావడం లేదని చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే? ఈ టిప్స్ పాటించేయండి.
టెస్టోస్టెరాన్ హార్మోన్ లేకపోవడం వల్ల, గడ్డం, శరీర జుట్టు ఎక్కువగా లేదా తక్కువగా పెరగవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీ ముఖం మీద చెల్లాచెదురుగా ఉన్న గడ్డం వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతుంటే, మీరు ఖచ్చితంగా ఈ కేవలం 10 రూపాయల హోం రెమెడీని ప్రయత్నించాలి. జస్ట్ వంటగదిలో కనిపించే రెండు వస్తువులు మీ సమస్యను నయం చేస్తాయి. ఇవి దాల్చిన చెక్క, నిమ్మకాయ. మంచి గడ్డం పెరుగుదలకు దాల్చిన చెక్క పొడి, నిమ్మకాయ వాడితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
మంచి, మందపాటి గడ్డం కోసం దాల్చిన చెక్క, నిమ్మకాయ వాడండి. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే, గడ్డం వెంట్రుకలు చిక్కగా అవుతుంది. చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం, దాల్చిన చెక్క, నిమ్మకాయలలో ఉండే లక్షణాలు ముఖంపై ఉన్న రంధ్రాలను సక్రియం చేయడంలో సహాయపడతాయి. గడ్డం వెంట్రుకలు పెరగడానికి, క్రమం తప్పకుండా నిమ్మరసంతో కలిపిన దాల్చిన చెక్క పొడిని మీ ముఖంపై రాయాలి.
దాల్చిన చెక్క, నిమ్మరసం ముఖానికి పూయడం వల్ల గడ్డం పెరగడమే కాకుండా, మీ చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి. నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి మీ మొటిమలను నయం చేయడంలో సహాయపడతాయి. ఇది చర్మ ఇన్ఫెక్షన్లు, బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది. దీనితో పాటు, మీరు జిడ్డుగల చర్మ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. అయితే దాల్చిన చెక్క ముక్కను రుబ్బుకుని పొడిలా చేయండి. మీరు మార్కెట్ నుంచి నేరుగా దాల్చిన చెక్క పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఈ పొడికి ఒక చెంచా నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్‌ను మీ ముఖంలోని గడ్డం ఉన్న భాగంలో అప్లై చేయండి. ఈ ప్యాక్‌ను మీ ముఖంపై దాదాపు 15 నిమిషాలు ఉంచి, ఆపై మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. మీరు ఈ ప్యాక్‌ను వారానికి 2 నుంచి 3 సార్లు మీ ముఖంపై అప్లై చేసుకోవచ్చు.
Also Read : పొడవాటి గడ్డం అంటే ఇష్టమా? కానీ నష్టాలు ఉన్నాయి తెలుసా?