Enemies : సమాజంలో మంచివారు ఉంటారు.. చెడ్డవారు ఉంటారు. కానీ అందరూ మంచివారితోనే స్నేహం చేయాలని కోరుకుంటారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల కొందరు శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇలా శత్రువులుగా మారిన తరువాత వారితో చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రతీ విషయంలో శత్రువు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ శత్రువు గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఇలా శారీరకంగా..మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. అయితే శత్రువులను పెంచుకునే బదులు.. కొన్ని ట్రిక్స్ ద్వారా వారిని మిత్రులుగా మార్చుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా వారి నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా వారి దృష్టి పడకుండా ఉండడంతో ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంతకీ ఏం చేస్తే శత్రువులను మిత్రులుగా మార్చే ప్రయత్నం చేయొచ్చు..?
క్షమాపణ:
కొన్ని విషయాల్లో కొందరు శత్రువులుగా మారుతారు. అయితే తప్పు ఎదుటివారు చేసినా.. శత్రువులే అవుతారు. ఇలాంటి సమయంలో శత్రుత్వం కొనసాగొద్దు అనుకుంటే.. వారి కోరితే తప్పులను క్షమించే ప్రయత్నం చేయాలి. ఎదటివారిలో పశ్చాత్తాపం రావడంతో వారితో భవిష్యత్ లో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
కారణాలు:
అసలు శత్రువులుగా ఎందుకు మారారో కారణం తెలుసుకుంటే.. సగం టెన్షన్ తొలగిపోతుంది. ఒకవేళ ఆ కారణం పరిష్కరించుకోగలిగితే వెంటనే దాని కోసం ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మరోసారి అలాంటి మిస్టేక్ కాకుండా జాగ్రత్తపడాలి. ఈ విషయం ఎదుటివారికి అర్థం కాకపోతే ఇద్దరూ కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేయాలి. అప్పటికీ వినకపోతే వారికి దూరంగా ఉండడమే మంచిది.
సంభాషణ:
శత్రువులుగా మారిన వారితో ఏ విషయమైనా స్పష్టంగా మాట్లాడాలి. ఎందుకంటే కొన్ని సార్లు కొన్ని మాటలను తప్పుడుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మనసులో చెడు ప్రభావం ఉన్నప్పుడు ఎదుటివారు ఏం మాట్లాడినా వ్యతిరేకమే అనిపిస్తుంది. అందువల్ల సంభాషణ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఏదైనా తప్పిదం అయితే మరింత దూరం అయ్యే అవకాశం ఉంటుంది.
సహనం:
కొందరికి ఎదుటి వ్యక్తులతో శత్రుత్వం ఏర్పడిన తరువాత వారిపై మరింత పగ పెంచుకొని చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతారు. అలా కాకుండా కొన్ని రోజులు ఓపిక పట్టాలి. కాలం మారిన కొద్దీ వారి మనసులో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వారు మంచివారిగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల శత్రువుల విషయంలో కొన్నాళ్ల పాటు ఓపిక పట్టాలి. అంతేకాకుండా శత్రువు కనిపిస్తే నిత్యం వాదనలు చేయకుండా ఉండాలి. దీంతో ఎదుటి వ్యక్తిలో మార్పు వస్తుంది.
సానుకూల వాతావరణం:
శత్రువులు అయినప్పటికీ ఎదుటివారి వారి విషయంలో సానుకూల వాతావరణంతోనే ఉండాలి. ఎందుకంటే ఒక వైపు నుంచి సానుకూల భావన ఉంటే ఎదుటివారి మారిపోయే అవకాశం ఉంటుంది. దీంతో రెండు వైపులా శత్రుత్వం తొలగిపోతుంది. దీంతో వీరు స్నేహితులుగా మారుతారు. అయితే కొందరు ఎంత చెప్పినా వినని వారు ఉంటారు. ఇలాంటి వారి విషయంలో మాత్రం సానుకూల వాతావరణం పనిచేయదు. ఈ విషయంలో వారికి వ్యతిరేకంగా ఉండడమే మంచిది.
Also Read : శత్రువుతో ఇలా ప్రవర్తిస్తే విజయం మీదే..