Long Beard: గడ్డం పెంచుకోవడం వల్ల కొందరు అబ్బాయిలకు భలే లుక్ వస్తుంది కదా. బియర్డ్ లవర్స్ చాలా మందే ఉంటారు. మంచి హెయిర్ స్టైల్, గడ్డం మెయింటెన్ చేస్తే హీరో మాదిరి ఉంటారబ్బ. ఈ స్టైల్ ను ట్రెండ్ ను ఫాలో అవడం కూడా చాలా మందికి ఇష్టమే. అయితే హానెస్ట్ అమిష్ తరపున వన్‌పోల్ నిర్వహించిన 2019 సర్వే ప్రకారం 75% మంది పురుషులు గడ్డం వల్ల ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉన్నారట. అంతే కాదు చాలా మంది ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారట. 40% మంది ఫుల్ బియర్డ్ ఉండాలి అనుకుంటున్నారట. కానీ పొడవాటి గడ్డం మీ ఆరోగ్యానికి కూడా హానికరం అని మీకు తెలుసా. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, అది ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ఇంతకీ ఈ పొడవు గడ్డం వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయో చూసేద్దాం.
Also Read: మైక్రో రిటైర్మెంట్.. ఉద్యోగ విరమణలో కొత్త ఒరవడి..!
1. బ్యాక్టీరియా – ధూళికి నిలయం: పొడవాటి గడ్డంలో బాక్టీరియా, ధూళి సులభంగా పేరుకుపోతాయి. దీన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే, అది చర్మ సంక్రమణ, ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.
2. చర్మ అలెర్జీలు- దురద: గడ్డాన్ని సరిగ్గా చూసుకోకపోతే, అందులో మురికి, బ్యాక్టీరియా పేరుకుపోతుంది, ఇది చర్మ అలెర్జీలు, దురదకు కారణమవుతుంది. దీని వలన చర్మం ఎర్రగా మారుతుంది. నిరంతరం దురద కారణంగా మంటగా అనిపించవచ్చు.
3. మొటిమలు: పొడవాటి గడ్డం ఉంచుకోవడం వల్ల చర్మంపై నూనె,చెమట పేరుకుపోతుంది. ఇది రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. మొటిమల సమస్యను పెంచుతుంది. దీనివల్ల ముఖం, చర్మానికి చాలా నష్టం జరుగుతుంది.
4. దుర్వాసన – బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు: మీరు పొడవాటి గడ్డాన్ని ఉంచుకుని దాన్ని శుభ్రం చేయకపోతే, చిన్న ఆహార కణాలు గడ్డంలో చిక్కుకుపోతాయి. ఇది బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. దుర్వాసనకు కూడా కారణమవుతుంది. మరి తినేటప్పుడు మీ గడ్డం మీద ఆహారం పడుతుంది చూసుకుంటారా? బిస్కెట్స్ వంటివి అయితే పొడి మాదిరి పడుతుంటాయి. కానీ మీరు గమనించరు కదా. దాన్ని పక్కా క్లీన్ చేసుకోండి.
5. గడ్డం వల్ల వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్: గడ్డాన్ని సరిగ్గా చూసుకోకపోతే, సరిగ్గా క్లీన్ గా ఉంచుకోకపోతే తేమ, చెమట కారణంగా గడ్డంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని వలన చర్మంపై దద్దుర్లు, చికాకు ఏర్పడవచ్చు. ఈ సమస్య ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది.
6. ఆస్తమా – అలెర్జీలు పెరగవచ్చు: మీకు ఇప్పటికే ఆస్తమా లేదా దుమ్ము అలెర్జీ ఉంటే, పొడవాటి గడ్డం దానిని మరింత తీవ్రతరం చేస్తుంది. అందులో దుమ్ము, పుప్పొడి పేరుకుపోతాయి. ఇది శ్వాస తీసుకోవడంలో సమస్యలను కలిగిస్తుంది.
7. బట్టతల: యూరోపియన్ జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీ అండ్ ఆక్యుపేషనల్ ఫిజియాలజీలో 1988లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో, బట్టతల ఉన్న పురుషులలో చెమట బాష్పీభవనం తలపై వెంట్రుకలు ఉన్న పురుషుల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. ఈ పరిస్థితిని హైపర్థెర్మియా అని పిలుస్తారు. గడ్డాలు ఉన్న పురుషులలో బాష్పీభవనం 40% తక్కువగా ఉంది. దీని అర్థం గడ్డం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి పనిచేస్తుంది. దీనివల్ల బట్టతల పెరుగుతుంది.
మీ గడ్డాన్ని ఎలా సరిగ్గా చూసుకోవాలి: మీ గడ్డాన్ని ప్రతిరోజూ శుభ్రం చేసుకోండి. మంచి యాంటీ బాక్టీరియల్ షాంపూ లేదా ఫేస్ వాష్ ఉపయోగించండి. చర్మం పొడిబారకుండా ఉండటానికి మీ గడ్డానికి తేమను అందించండి. మీ గడ్డం ఎక్కువగా చిక్కుకుపోకుండా ఎప్పటికప్పుడు కత్తిరించండి. తిన్న తర్వాత మీ గడ్డంలో మురికి పేరుకుపోకుండా శుభ్రం చేసుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.