Snakes:వాస్తు శాస్త్రంలో మనకు ఎన్నో విషయాలు చెబుతారు. ఏ వస్తువు ఎక్కడ ఉంచుకోవాలో తెలుస్తుంది. ఇంకా ఏ జంతువును చూడాలి? దేన్ని చూస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనే దానిపై కూలంకషంగా వివరిస్తుంది. ఏ జంతువులను చూస్తే శుభాలు కలుగుతాయి? వేటిని చూస్తే అశుభాలో తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో పాములను చూస్తే కూడా శుభ, అశుభ శకునాలు ఉన్నాయని తెలుసా? పాములను ఏ సమయంలో చూస్తే మంచిది. ఏ సందర్భంలో చూడకూడదో లాంటి అనుమానాలు అందరిలో వస్తుంటాయి.

మనం బయటకు వెళ్లినప్పుడు మనకు పాములు కనిపించడం సాధారణమే. కానీ అవి ఎలా కనబడితే మనకు లాభమో తెలుసుకోవాలి. ఎలా కనబడితే మనకు కలిసొస్తుంది. ఎలా కనిపిస్తే నష్టాలు వస్తాయనే విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి. మనం ఏదైనా పనిమీద బయటకు వెళ్లినప్పుడు పాము మన కుడిపక్క నుంచి వెళితే మనకు కావాలనుకున్న పని అవుతుంది. మంచి జరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. పాము కుడిపక్క నుంచి వెళితేనే మనకు ఊహించని లాభాలు కలుగుతాయి.
పాము ఏదైనా చెట్టు కానీ, గోడ కానీ ఎక్కుతున్నట్లు కనబడితే కూడా మనకు శుభం కలుగుతుందని భావించాలి. పాము చెట్టు పైకి ఎక్కుతున్నట్లు కనబడితే మనం కూడా జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని అంటారు. భవిష్యత్ లో కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం. మనకు అకస్మాత్తుగా ధనలాభ సూచనలు ఉంటాయని చెబుతారు. ఇలా పాముల విషయంలో మనకు ఎన్నో విషయాలు తెలుసుకుంటే సరి.
రెండు పాములు కనిపిస్తే కూడా అశుభానికి సంకేతమేనట. పాము చనిపోయి కనిపిస్తే కూడా అపశకునమే. చనిపోయిన పామును చూసిన వెంటనే శివాలయానికి వెళ్లి శివుడికి పూజలు చేస్తే ఫలితం ఉంటుంది. చనిపోయిన పామును చూసిన తరువాత శివాలయానికి వెళ్లి పరిహారాలు చేస్తే దోషాలు పోతాయని చెబుతున్నారు. జంట పాములను చూస్తే కూడా దోషాలు వస్తాయి. ఒక వేళ మనకు కనబడితే వాటికి దూరంగా వెళ్లిపోవడమే మంచిది. జంట పాములను చూస్తే మనకు ఇబ్బందులు ఎదురవుతాయి.