Homeఎంటర్టైన్మెంట్Hyper aadi - Jessi : ఢీ వేదికగా హైపర్ ఆదితో బయటపడ్డ గే...

Hyper aadi – Jessi : ఢీ వేదికగా హైపర్ ఆదితో బయటపడ్డ గే లవ్ స్టోరీ… బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సీ ఆ టైపా!

 
Hyper aadi – Jessi : ఢీ డాన్స్ రియాలిటీ షో వేదికగా ఆసక్తికర సంఘటన చేసుకుంది. బిగ్ బాస్ ఫేమ్ జెస్సీతో హైపర్ ఆది ఆడుకున్నాడు. అతన్ని గే అంటూ సరదా పంచాడు. నెక్స్ట్ ఢీ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. కంటెస్టెంట్స్ దుమ్మురేపే ఫర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. జడ్జెస్ గా శేఖర్ మాస్టర్, శ్రద్దా దాస్ పిచ్చగా ఎంజాయ్ చేశారు. కంటెస్టెంట్స్ ఒకరికి మించి మరొకరు డాన్స్ చేయగా జడ్జెస్ సీట్లో నిలవలేకపోయారు. కాగా హైపర్ ఆది పోకిరి మూవీ స్పూఫ్ స్కిట్ చేశాడు. ఈ స్కిట్ లో బిగ్ బాస్ జెస్సీ కూడా భాగమయ్యాడు. ‘నీకు గన్ దొరికిందని తెచ్చిచ్చావ్,  దివ్య అనే ఒక అమ్మాయి కూడా దొరికింది కదా. మరి తెచ్చివ్వలేదే’ అని ఆదిని ఉద్దేశిస్తూ అన్నాడు. 
 
‘తెచ్చిచ్చినా నువ్వు పీకేది ఏం లేదని నేనే తెచ్చివ్వలేదు’ అని పంచ్ వేశాడు. మా సెట్ కొచ్చి మా మీదే రుబాబు చేస్తావా? అని యాంకర్ ప్రదీప్ హైపర్ ఆదిని ఉద్దేశించి అన్నాడు. ‘నువ్వు డబ్బులిస్తే జడ్జెస్ ముందున్న టేబుల్ ఎక్కి డాన్స్ చేస్తా’ అన్నాడు. ఇక జెస్సీ కలగజేసుకొని హైపర్ ఆది చొక్కా పట్టుకొని దగ్గరకు లాక్కొని ‘నీకు నీతీ జాతీ లేదు కదా, అందుకేరా నువ్వంటే ఇష్టం’ అన్నాడు. ఆ డైలాగ్ కి హైపర్ ఆది జెస్సీ వైపు అదోలా చూశాడు. సెట్ లో ఉన్న జనాలు పెద్దగా నవ్వేశారు. 
 
ఇక పోకిరి లిఫ్ట్ సీన్ ని తలపించేలా ఆది, జెస్సీ మరొక అమ్మాయి స్పూఫ్ చేశారు. ఆది పక్కనే ఉన్న లేడీతో ‘స్మెల్ బాగుంది ఏం సెంట్?’ అని అడిగాడు. అందుకు ఆ లేడీ ‘లేడీస్ పెర్ఫ్యూమ్’ అని చెప్పింది. మరి వీడి దగ్గర కూడా అదే స్మెల్ వస్తుందేంటి..’ అని జెస్సీని ఉద్దేశించి అన్నాడు. మొత్తంగా పోకిరి స్కిట్ లో జెస్సీని హైపర్ ఆది గే అని ప్రొజెక్ట్ చేశాడు. హాస్యంలో భాగంగా చేసిన ఈ గే లవ్ స్టోరీ ఢీ ఆడియన్స్ చేత నవ్వులు పూయించింది. నెక్స్ట్ ఎపిసోడ్ పై అంచనాలు పెంచేసింది. 
 
జెస్సీ వృత్తిరీత్యా మేల్ మోడల్. అతడు బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్నాడు. ఆ విధంగా వెలుగులోకి వచ్చాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అధిక వారాలు హౌస్లో ఉన్నాడు. అప్పటి నుండి బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. ఇక హైపర్ ఆది ఢీ షోని కూడా తన స్కిట్స్ తో దున్నేస్తున్నాడు. ఈ మధ్య అతడు యాక్టర్, రైటర్ గా బిజీ అయ్యారు. ధమాకా, సార్ చిత్రాలకు డైలాగ్స్ అందించినట్లు సమాచారం. సార్ చిత్రంలో హైపర్ ఆది కీలక రోల్ చేశారు.  

Hyper Aadi,Sekhar Master & Jessy Comedy - Dhee 15 Championship Battle Promo - 1st March 2023

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version