Salt Side Effects: ఉప్పు ఆరోగ్యానికి ముప్పు. మన శరీరంలో ఉన్న ఉప్పుతోనే మనకు సరిపోతుంది. బయట నుంచి ఉప్పు తీసుకోవడం శ్రేయస్కరం కాదు. ఉప్పు వల్ల మన ఆరోగ్యం దెబ్బ తింటుంది. మధుమేహం, గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణమవుతోంది. వైద్యులు సైతం ఇదే విషయం చెబుతున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని ఉప్పును చెబుతుంటారు. కానీ ఉప్పుతో ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి. ఉప్పులేని కూర చప్పగా ఉంటుందనే ఉద్దేశంతో మనిషి రోజుకు తినేదానికంటే ఎక్కువగా తీసుకుంటున్నారు.

చిటికెడు ఉప్పుతో మనకు ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. బీపీ పెరుగుతుంది. దీంతో ఇతర అవయవాలు దెబ్బతింటాయి. మనకు తెలియకుండా ఉప్పు శరీరంలోకి ఎక్కువగానే వెళ్తోంది. రుచికోసం ఉప్పును వాడుకుంటాం. కానీ మోతాదు మించితే అనారోగ్యం దరిచేరుతుంది. ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకుంటే అధిక రక్తపోటు సమస్య బాధిస్తుంది. మన దేశంలో ఉప్పు వాడకం పెరిగిపోతుంది. ఫలితంగా గుండె జబ్బులతో లక్షల్లో మరణాలు సంభవిస్తున్నాయి. పాతికేళ్లకే రక్తపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
పట్టణ ప్రాంతాల్లో 35 శాతం, పల్లెల్లో 25 శాతం మంది రక్తపోటు బారిన పడుతున్నారు. పూర్వం రోజుల్లో ఉప్పు వాడకం తక్కువగానే ఉండేది. మారుతున్న కాలంలో ఆహార వైవిధ్యం పెరిగే కొద్ది ఉప్పు వాడకం ఎక్కువైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉప్పు మోతాదు పెరుగుతోంది. ఫలితంగా జబ్బులకు దగ్గరవుతున్నారు. పలు అధ్యయనాలు ఉప్పు వాడకంతో రక్తపోటు, గుండె జబ్బుల ముప్పు పెరుగుతోందని సూచిస్తున్నాయి. 2.30 లక్షల మందిపై జరిపిన పరిశోధనలో వ్యాధులకు మూలం ఉప్పే అని తేలిపోయింది. దీంతో ఉప్పుకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
ఉప్పుకు బీపీకి సంబంధం ఏమిటి? ఆహారం ఉప్పు ఎక్కువైతే ఏమవుతుంది? ఉప్పు వాడకం పెరిగితే గుండెపోటు, పక్షవాతం లాంటి వస్తాయి. మూత్ర పిండాల్లో కూడా సమస్యలు తలెత్తుతాయి. అందరిని భయపెడుతున్న నాలుగు ప్రధాన క్యాన్సర్లలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఒకటి. పలు అధ్యయనాల్లో ఉప్పే కారణమని తేల్చారు. ఉప్పు తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం 30 శాతం ఉన్నట్లు గుర్తించారు. ఉప్పు వల్ల కడుపులో హెలికోబాక్టర్ పైలొరి అనే సూక్ష్మక్రిములు తయారవుతున్నాయి.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం మనకు కావాల్సిన ఉప్పు రెండున్నర గ్రాములే. రోజు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉప్పు తగ్గించుకుంటేనే మంచిది. పచ్చళ్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని తక్కువగా తీసుకోవడమే ఉత్తమం. రోజువారీగా తీసుకునే ఆహారాల్లో ఐదు గ్రాముల ఉప్పు దాటకూడదని తెలిసినా మనం తీసుకునే ఉప్పు అంతకంటే ఎక్కువగానే ఉంటోంది. దీంతోనే జబ్బుల ముప్పు పొంచి ఉంటుంది.
ఉప్పు వాడకాన్ని తగ్గించుకునేందుకు శ్రద్ధ వహించాలి. బేకరీ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అందులో ఉప్పు, చక్కెర, నూనె వంటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. శాండివిజ్ బ్రెడ్, సాస్ లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రెస్, సూప్స్ వంటి వాటిలో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. మాంసం, చీజ్ ఉత్పత్తులు వంటి వాటిలో కూడా ఉప్పు ఉంటుంది. వీటిని దూరం పెట్టడమే మంచిది. పెరుగు, మజ్జిగ వంటి వాటిలో ఉప్పు చేర్చుకోకూడదు. పచ్చళ్లలో ఉప్పు ఎక్కువ. ఊరగాయలు తినడం తగ్గించుకోవాలి.
బాదం, పిస్తా, శనగలు, వేరుశనగ, బఠాణీలు తీసుకోవడం వల్ల ఉప్పు ముప్పు ఉండదు. సాయంత్రం పూట టిఫిన్లు చేస్తారు. రాత్రి పూట భోజనం త్వరగా చేస్తే మంచిది. పండ్లు, కూరగాయల్లో ఉప్పు ఉండదు. పొటాషియం తక్కువ ఉండటంతో ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.